జాతీయ వార్తలు

‘హోదా’ సాధనే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 15: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాబట్టేందుకు ఢిల్లీలో గళం వినిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆ పార్టీ పార్లమెంట్ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో శనివారం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ సమస్యలను సామరస్యపూర్వకంగానే కేంద్రం దృష్టికి ఎలా తీసుకెళ్లాలన్న దానిపై కూడా ఎంపీలకు సూచనలు చేశారు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను పార్లమెంట్ ఉభయ సభల్లో ఏ విధంగా ప్రస్తావించాలన్న దానిపై జగన్ వారికి పలు సూచనలు చేశారు. పార్లమెంట్‌లో నాల్గవ అతిపెద్ద పార్టీగా అవతరించిన వైఎస్సార్‌సీపీ దీన్ని ఒక అవకాశంగా మలుచుకోవాలని వారికి వివరించారు. లోక్‌సభలో మనకున్న సంఖ్యాబలాన్ని సమర్థవంతంగా వినియోగించుకొని రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకోవాలని ఎంపీలకు సూచించారు. పార్టీ తరఫున ఎన్నికైన ఎంపీల్లో ఎక్కువ మంది కొత్తవారు కావడం.. ఎక్కువ శాతం యువకులు, విద్యావంతులు ఉండడం వల్ల భాషాపరమైన సమస్య ఉండదనే అభిప్రాయాన్ని జగన్ వ్యక్తం చేశారు. రాష్ట్రానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి సభ్యులంతా కలిసికట్టుగా పనిచేయాలని వారికి సూచించారు. వివిధ మంత్రిత్వశాఖల వారీగా సమస్యల పరిష్కారానికి ఎంపీల బృందం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. ఒక్కో బృందానికి కొన్ని శాఖలను అప్పగించి, నిధుల విడుదలకు ఎంపీల బృందాలు కృషి చేయాలని సూచించారు. వ్యక్తిగత ఆసక్తి,ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలను ఎంపిక చేసుకోవాలని ఎంపీలకు జగన్ వివరించారు. పార్టీ ఎంపీలంతా సభా మర్యాదలు పాటించడంతోపాటు సభ గౌరవం పెరిగేలా హుందాగా వ్యవహరిస్తూ సభా కార్యక్రమాల్లో తప్పనిసరిగా పాల్గొనాలని అన్నారు. పార్లమెంట్ పార్టీ నాయకుడిగా విజయసాయిరెడ్డి, లోక్‌సభా పక్షం నాయకుడిగా మిథున్‌రెడ్డి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు సాగాలని జగన్ సూచించారు.
చిత్రం... ఢిల్లీలో శనివారం నిర్వహించిన వైఎస్‌ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడుతున్న జగన్