జాతీయ వార్తలు

వారానికి రెండుసార్లు యూపీలోనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 16: ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన కాంగ్రెస్.. పార్టీని బలోపేతం చేసే దిశగా కసరత్తు ప్రారంభించింది. ముఖ్యంగా 2022లో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఆ రాష్ట్రంలో పార్టీ పుంజుకోవడానికి చర్యలు తీసుకొంటోంది. ఇందులో భాగంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ యూపీలో జరిగిన పరాభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించుకొన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో కనీసం వారంలో రెండుసార్లు కార్యకర్తలను నేరుగా కలుసుకోవడం.. వారితో చర్చలు జరిపి వంటి రాష్ట్రం లో పార్టీ పుంజుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న అంశాలపై ప్రియాంక గాంధీ దృష్టి సారించనున్నారు.
కార్యకర్తలకు ఎలాంటి ముందస్తు అపాయింట్‌మెంట్‌లు లేకుండా నేరుగా వారితోనే సంప్రదింపులు జరిపే దిశగా చర్యలు ప్రియాంక ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో ముఖ్యంగా కార్యకర్తలు, నాయకులతో తరచు మాట్లాడుతూ వారి మధ్య కమ్యూనికేషన్, కలిసి పనిచేసే అంశాల్లో లోపం లేకుండా చూడాలని భావిస్తున్నారు. యూపీఏ చైర్‌పర్సన్, తన తల్లి అయిన సోనియా గాంధీతో కలిసి ఇటీవల జరిపిన రాయ్‌బరేలిలో జరిపిన పర్యటన నేపథ్యంలో పార్టీ బలోపేతం చేసే దిశగా చర్యలు ప్రారంభించి తీరాలని నిర్ణయించారు. లోక్‌సభ ఎన్నికల్లో పనిచేయని నేతలపై చర్యలు తీసుకోవాలని కూడా ఆమె భావిస్తున్నారు. ఇప్పటికే లోక్‌సభ ఎన్నికల్లో ఎవరైతే సక్రమంగా పనిచేయకుండా పార్టీ పరాజయానికి కారకులైన వారి జాబితా తన వద్ద సిద్ధంగా ఉందనీ, వారి పేర్లను త్వరలోనే బహిర్గతం చేయాలని ప్రియాంక నిర్ణయించినట్లు సమాచారం. రాష్ట్రంలోని 80 పార్లమెంట్ స్థానాలుండగా ముఖ్యంగా రాయ్‌బరేలి, అమేథిలో ప్రియాంక ఉద్ధృతంగా ప్రచారం చేశారు. 80 స్థానాలున్న ఉత్తర ప్రదేశ్‌లో కేవలం ఒక్క రాయ్‌బరేలిలో మాత్రమే విజయం సాధించడం.. పార్టీ అధ్యక్షుడైన రాహు ల్ గాంధీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో అమేథిలో ఓడిపోవడం తెలిసిందే. పార్టీ వైఫల్యంపై ప్రియాంకతో పాటు ఏఐసీసీ ఇన్‌చార్జి జ్యోతిరాదిత్య సింథియా కూడా పార్టీ కార్యకర్తలు, నేతలో సమీక్షలు నిర్వహించారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కేవలం 52 పార్లమెంట్ స్థానాల్లో మాత్రమే విజయం సాధించి ఘోర పరాజయాన్ని మూట గట్టుకోవడపై కూడా వీరు చర్చలు జరిపినట్లు సమాచారం. కాగా, రాష్ట్రంలో 11మంది ఎమ్మెల్యేలు లోక్‌సభకు ఎన్నికైన తరుణంలో ఇక్కడ త్వరలో అసెంబ్లీకి ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.