జాతీయ వార్తలు

హోదాయే ఊపిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 16: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అఖిలపక్ష సమావేశంలో కోరినట్లు వైఎస్‌ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి తెలిపారు. ఆదివారం నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశానికి హాజరైన అనంతరం విజయసాయి విలేఖరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ బాగుపడాలన్నా, సర్వతోముఖాభివృద్ధి సాధించాలన్నా ప్రత్యేక హోదా ఎంతో అవసరం.. ప్రత్యేక హోదా అనేది ఏపీకి ప్రాణవాయువుతో సమానమని నరేంద్ర మోదీకి మరోసారి వివరించినట్లు ఆయన చెప్పారు. ప్రత్యేక హోదా అనేది పార్లమెంటులో ఇచ్చిన హామీ.. బీజేపీ ఎన్నికల ప్రణాళికలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని 2014లో హామీ ఇచ్చారని నరేంద్ర మోదీకి గుర్తు చేశామని విజయసాయి రెడ్డి చెప్పారు. బీసీలకు జనాభా ప్రాతిపదికపై రిజర్వేషన్లు కల్పించాలని కూడా ప్రభుత్వాన్ని కోరామని, అవసరమైతే రాజ్యాంగంలోని 9వ షెడ్యూలును సవరించాలని డిమాండ్ చేశామని విజయసాయి రెడ్డి తెలిపారు. బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధత కల్పించాల్సిన అవసరం ఉన్నదని స్పష్టం చేశామన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం సీట్లు రిజర్వు చేసేందుకు ఉద్దేశించిన బిల్లును వీలున్నంత త్వరగా పార్లమెంటులో ప్రతిపాదించాలని డిమాండ్ చేశామన్నారు. పార్లమెంటు సమయం వృథా కాకుండా చర్యలు తీసుకోవాలి.. అందుకు చట్టం తీసుకురావాలి.. పార్లమెంటు కఖచ్చితంగా ఇన్నిసార్లు జరగాలి.. సమావేశాల్లో అలజడి సృష్టించేవారి జీతభత్యాల్లో కోత విధించాలి అని ప్రధాన మంత్రికి సూచించామని చెప్పారు. తమ ప్రతిపాదనలకు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయని అన్నారు. ప్రజల ప్రయోజనాలను పరిరక్షించే అంశాలకు వైఎస్‌ఆర్‌సీపీ పార్లమెంటులో మద్దతు ఇస్తుందన్నారు. రాష్ట్రానికి వీలున్నంత త్వరగా ప్రత్యేక హోదా ఇవ్వాలి.. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేయాలని కోరినట్లు లోక్‌సభలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు మిథున్ రెడ్డి తెలిపారు. లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవి గురించి ఎలాంటి ప్రతిపాదన రాలేదని విజయ సాయిరెడ్డి తెలిపారు. తమ పార్టీకి ప్రత్యేక హోదా సాధనే అత్యంత ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.