జాతీయ వార్తలు

నిర్మాణాత్మకంగా పనిచేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 16: తెలుగుదేశం పార్టీ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పని చేస్తుందని లోక్‌సభలో తెలుగుదేశం పక్షం నాయకుడు గల్లా జయదేవ్ తెలిపారు. ప్రధాన మంత్రి అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశానికి హాజరైన అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ సహకార ఫెడరలిజం విజయవంతం కావాలంటే రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలపై కూడా పార్లమెంటులో చర్చకు అవకాశం ఇవ్వాలని సూచించినట్లు చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని మరోసారి డిమాండ్ చేసినట్లు జయదేవ్ తెలిపారు. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలను పూర్తిచేయాలి.. సమస్యలను పరిష్కరించాలని ప్రధాన మంత్రిని కోరినట్లు జయదేవ్ చెప్పారు. పార్లమెంటు ఉభయ సభలు సజావుగా జరిగేందుకు ప్రభుత్వం ప్రత్యేక బాధ్యతతో పని చేయవలసి ఉంటుందని జయదేవ్ అభిప్రాయపడ్డారు. బ్రిటన్ పార్లమెంటులో ఉన్నట్లు పార్లమెంటు సమావేశాలు జరిగినప్పుడు వారానికి ఒక రోజు ప్రధాన మంత్రి ప్రశ్నల కార్యక్రమం నిర్వహించాలనే సూచన చేశామని ఆయన చెప్పారు. లోక్‌సభ, రాజ్యసభ టీవీల ప్రసారాలను అన్ని భాషల్లోకి తర్జుమా చేసి ప్రసారం చేయాలని డిమాండ్ చేసినట్లు గల్లా జయదేవే తెలిపారు. పార్లమెంటులో హిందీ తెలిసినవారు కేవలం ముప్పై శాతం మందేనని.. మిగతా ఎంపీలంతా ఇతర భాషాలు మాట్లాడేవారు కాబట్టి లోక్‌సభ, రాజ్యసభ ప్రసారాలను ఇతర భాషల్లోకి తర్జుమా చేసి ప్రసారం చేయాలని సూచించినట్లు తెలిపారు.