జాతీయ వార్తలు

ఏనుగులనే తినేస్తున్న పులులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 16: ఉత్తరాఖండ్‌లోని కార్బెట్ జాతీయ పార్కులో చాలా విచిత్రమైన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ జాతీయ పార్కులో ఏనుగులను పులులు చంపి తినేస్తున్నాయి. దీంతో పార్కు అధికారులు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా వన్యప్రాణి ఏనుగు జోలికి క్రూర మృగాలైన సింహం, పులి, చిరుత వెళ్ళవు. అయితే ఇక్కడి జాతీయ పార్కులో మాత్రం పులులు ఏనుగులను వేటాడి చంపి, తినేయడం అధికారుల్లో ఆందోళన కలిగిస్తున్నది. పులులు ముఖ్యంగా ఏనుగు పిల్లలపైనే దృష్టి పెడుతున్నాయని అధికారులు చెబుతున్నారు. 2014 నుంచి ఈ ఏడాది మే 31వ తేదీ వరకు తొమ్మిది పులులు, 21 ఏనుగులు, ఆరు చిరుతలు మరణించాయి. జాతీయ పార్కులో పరస్పర దాడుల్లోనే ఇవి మరణించినట్లుగా అధికారులు భావిస్తున్నారు. సాధారణంగా వన్యప్రాణులు దాడులు చేసుకోవని, ఇవి మరణించడం తమకు దిగ్భ్రాంతిని కలిగించిందని సీనియర్ అటవీ శాఖ అధికారి, ఈ జాతీయ పార్కు ఇన్‌ఛార్జీ సంజీవ్ చతుర్వేది తెలిపారు. ఇందులో 225 పులులు, 1,100 ఏనుగులు ఉన్నట్లు ఆయన చెప్పారు. ఇలాఉండగా ఏనుగులను పులులు చంపి తినడం పట్ల వన్యప్రాణుల కార్యకర్త అజయ్ దుబే విస్మయాన్ని వ్యక్తం చేశారు. ఈ పరిణామం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నదని అన్నారు. దీనిపై వెంటనే సంబంధిత ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని, ఏనుగులకు రక్షణ కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.