జాతీయ వార్తలు

కోలాహలంగా లోక్‌సభ గ్యాలరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 17: పదిహేడో లోక్‌సభ తొలి సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన ఆంధ్రప్రదేశ్ ఎంపీల చేత ప్రొటెం స్పీకర్ వీరేంద్రకుమార్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు ఏపీకి చెందిన ఎంపీల కుటుంబ సభ్యులు, వారి అనుచరులు, కార్యకర్తలు పార్లమెంటుకు రావడంతో కోలాహలంగా మారింది. అంగ్ల అక్షర క్రమంలో రాష్ట్రాలవారీగా ఆంధ్రప్రదేశ్ ఎంపీలు మొదటి రోజునే ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగుదేశం లోక్‌సభ సభ్యులు కింజారపు రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని, గల్లా జయ్‌దేవ్ కుంటుబ సభ్యులు ప్రమాణ స్వీకారానికి హజరయ్యారు.
అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ లోక్‌సభ సభ్యులు గొడ్డేటి మాధవి, బెల్లాన చంద్రశేఖర్, వెంకట సత్యవతి, వంగా గీత, అనురాధ, మార్గాని భరత్, కె.రఘు రామకృష్ణం రాజు, కోటగిరి శ్రీధర్, బాలశౌరి, లావు శ్రీకృష్టదేవరాయులు, నందిగాం సురేష్, శ్రీనివాసులరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, సంజీవ్‌కుమార్, తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, వైఎస్ అవినాష్ రెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, బల్లి దుర్గాప్రసాద్, పీవీ మిథున్‌రెడ్డి, ఎన్ రెడ్డప్ప కుటుంబ సభ్యులు, అనుచరులు, కర్యకర్తలు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలావుండగా విశాఖపట్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఎన్నికైన ఎంవీవీ సత్యనారాయణ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సమయంలో లోక్‌సభ గ్యాలరీలో కూర్చొని ఉన్న ఎంవీవీ అనుచరులు ఆయనకు అనుకూలంగా నినాదాలిచ్చారు. అది గమనించిన లోక్‌సభ గ్యాలరీ సిబ్బంది మొదటగా ఇద్దరిని, తరువాత ఎంవీవీ సత్యనారాయణ పేరుతో గ్యాలరీలోకి వచ్చిన ఆయన అనుచరులను బయటకు పంపించి వేశారు.

చిత్రాలు.. పదిహేడవ లోక్‌సభ తొలి సమావేశాలను తిలకించేందుకు కుటుంబ సమేతంగా విచ్చేసిన
ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు