జాతీయ వార్తలు

మమత వల్లే రాజకీయ హింస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగ్‌పూర్: పశ్చిమ బెంగాల్‌లో చోటు చేసుకున్న రాజకీయ హింసకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అధికార యావే కారణమని ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పని చేసే చట్టాలను అమలు చేయడం ద్వారా కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా ముఖ్యమంత్రిగా ఆమె బాధ్యత అని భగవత్ స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ ఆ తర్వాత రాష్ట్రంలో జరిగిన హింసాకాండకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిష్క్రియే కారణమని అన్నారు. అసలు పశ్చిమ బెంగాల్‌లో చోటు చేసుకున్న సంఘటనలు ఇంత వరకు ఎక్కడైనా జరిగాయా అని ఆయన ప్రశ్నించారు. ఈ హింసాకాండకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తల శిక్షణ కార్యక్రమం ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పరిస్థితులకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన గూండాలే కారణమని మమత చెబుతున్నారని, అటువంటప్పుడు వారిపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం ఏమి చేస్తున్నదని ఆయన ప్రశ్నించారు.

చిత్రం...ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్