జాతీయ వార్తలు

కర్నాటక కాంగ్రెస్‌లో కదుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 19: కర్నాటక కాంగ్రెస్‌లో సంక్షోభం మొదలైంది. లోక్‌సభ ఎన్నికల్లో ఎదురైన పరాజయాల నేపథ్యంలో రాష్ట్రంలో సంస్కరణలు చర్యలు చేపట్టాలని అధిష్ఠానం యోచిస్తోంది. ఇందులో భాగంగా ఆ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని రద్దు చేస్తూ ఏఐసీసీ బుధవారం నిర్ణయం తీసుకొంది. అయితే, పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, అధ్యక్షుడు అలాగే ఉంటారు. ‘కర్నాటక పీసీసీ రద్దు చేయాలని ఏఐసీసీ నిర్ణయించింది.. అయితే, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, అధ్యక్షుడిని యథాతథంగా కొనసాగుతారని’ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ చెప్పారు. లోక్‌సభ ఎన్నికలో ఘర పరాజయాన్ని మూటగట్టుకొన్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతల్లో లుకలుకలు మొదలయ్యాయి. కర్నాటక కేబినెట్‌లో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకొన్న సంగతి విదితమే.