జాతీయ వార్తలు

‘మెదడు వాపు’తో జాగ్రత్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, జూన్ 19: బీహార్ రాష్ట్రంలోని ముజఫర్‌పూర్ జిల్లాను వణికించిన తీవ్రమైన ‘ఎన్స్‌ఫలిటీస్ సిండ్రోమ్’ (ఎఇఎస్) వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని రాజస్థాన్ ప్రభుత్వం రాష్ట్ర వైద్య శాఖ ఉన్నతాధికారులను ఆదేశించింది. అందుకు అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించింది. ఆ లక్షణాలతో రోగులెవరైనా ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరినట్లయితే ఆ వ్యాధిని ఎదుర్కొవడానికి అన్ని విధాలా చర్యలు చేపట్టాలని, అందుకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించింది. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో చిన్నారులకు సోకుతున్న ఈ మెదడు వాపు వ్యాధిని ఎదుర్కొని వారికి సరైన చికిత్స అందించేందుకు వీలుగా వైద్య నిపుణులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించాలనంటూ కోరుతూ దాఖలైన పిటీషన్‌ను సుప్రీం కోర్టు స్వీకరించింది. ఈ వ్యాధి సోకిన వారికి తీవ్రమైన తల నొప్పి, మెడ నొప్పి, జ్వరం, నీరసం, వాంతులు కావడం, మాట్లాడేందుకు రాకపోవడం, జ్ఞాపక శక్తి లోపించడం వంటివి ఉంటాయని, ఇది త్వరగా ఇతరులకు వ్యాపిస్తుందని వైద్యాధికారులు తెలిపారు.