జాతీయ వార్తలు

హామీ ఇచ్చారు.. అమలుచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 19: పార్లమెంటులో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వవలసిందేనని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన అఖిలపక్షం సమావేశంలో మరోసారి డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా హామీని అమలు చేయకపోతే తమ ఎంపీలు పార్లమెంటులో గొడవ చేస్తారని ఆయన పరోక్షంగా హెచ్చరించారు. నవ భారత నిర్మాణానికి తీసుకోవలసిన చర్యల గురించి చర్చించేందుకు నరేంద్ర మోదీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయటం తెలిసిందే. ఈ సమావేశంలో జగన్ మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వవలసిన అవసరం గురించి మరోసారి వివరించారు. నరేంద్ర మోదీ ప్రతిపాదించిన ‘ఒక దేశం ఒక ఎన్నిక’ ప్రతిపాదనను సమర్థించిన జగన్ ఆ వెంటనే పార్లమెంటు ఉత్పాదన (ప్రొడక్టివిటీ) పెంచటం గురించి మాట్లాడుతూ పార్లమెంటులో ఇచ్చిన హామీలు అమలు కాకపోతే ప్రొడక్టివిటీ ఎలా పెరుగుతుందని ప్రశ్నించారు. 22 మంది లోక్‌సభ సభ్యులున్న నాల్గవ అతిపెద్ద పార్టీ అధ్యక్షుడి హోదాలో తాను మాట్లాడుతున్నానని ఆయన చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి అధికార పక్షంతోపాటు ప్రతిపక్షం.. ఇప్పటి అధికార పక్షం హామీ ఇచ్చింది కానీ ఇంతవరకు అమలు కాలేదని జగన్ అన్నారు. ప్రజాస్వామ్య దేవాలయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కాకపోతే పార్లమెంటుపై విశ్వాసం ఎలా పెరుగుతుందని ముఖ్యమంత్రి ప్రశ్నించటం గమనార్హం. రాష్ట్ర విభజనకు ముందస్తు షరతు ప్రత్యేక హోదా ఇవ్వటం అయితే అది ఇంతవరకు అమలు కాలేదని ఆయన వాపోయారు. ప్రజల విశ్వాసం, గౌరవం పొందాలంటే ఇచ్చిన హామీలను అమలు చేయవలసిన బాధ్యత పార్లమెంటుపై ఉన్నదని స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తేనే బాధిత రాజకీయ పార్టీలు పార్లమెంటులో గొడవ చేయటం మానివేస్తాయంటూ ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తమ సభ్యులు సభలో గొడవ చేస్తారని జగన్ పరోక్షంగా హెచ్చరించారు. పార్టీ ఫిరాయింపులను నిరోధించేందుకు రాజ్యాంగంలోని 10వ షెడ్యూలును కచ్చితంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నియమ నిబంధలను వదిలేసి తమ ఎంపీలను తీసుకున్నదని ఆయన దుయ్యబట్టారు. ఇదేవిధంగా 23 మంది శాసన సభ్యులను కూడా తెలుగుదేశంలో చేర్చుకున్నారన్నారు. తెలుగుదేశం నాయకులు పార్టీ ఫిరాయించిన వారికి కొందరికి డబ్బు ఇస్తే.. మరికొందరికి మంత్రి పదవులు ఇచ్చారన్నారు. పార్టీ ఫిరాయించిన ఎంపీలు, శాసనసభ్యుల సభ్యత్వాలను రద్దు చేయలేదని అన్నారు. దీని వలన పార్టీ ఫిరాయింపుల చట్టం నవ్వుల పాలైందని జగన్ దుయ్యబట్టారు. పార్టీ ఫిరాయింపుల వ్యవహారాన్ని 90 రోజుల్లో తేల్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఒక దేశం ఒక ఎన్నికను సమర్థించిన జగన్ వివిధ రాష్ట్రాల ఎన్నికలు వివిధ సమయాల్లో జరుగుతున్నందున వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ప్రధాన మంత్రి ఒక విధాన నిర్ణయం తీసుకుంటారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఒక దేశం ఒక ఎన్నిక అనేది చాలా గొప్ప నిర్ణయమని ప్రధాన మంత్రిని ప్రశంసించారు.