జాతీయ వార్తలు

జమిలికి తెరాస ఓకే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 19: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఒకే దేశం-ఒకే ఎన్నికలకు తమ పార్టీ సమర్థిస్తోందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు వెల్లడించారు. పార్లమెంట్‌రీ వ్యవహారాల శాఖ నేతృత్వంలో పార్లమెంట్ లైబ్రరీ హాలులో బుధవారం జరిగిన అఖిలపక్ష సమావేశానికి తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి కేటీఆర్ పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జమిలి ఎన్నికల నిర్వహణపై ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయాలను నిర్మొహమాటంగా ఈ సమావేశంలో వివరించినట్టు చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75వ వసంతంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో ‘కొత్త భారతదేశం’ నిర్మాణానికి ఏం చేస్తే బాగుంటుందని అన్ని పార్టీల అభిప్రాయలను ప్రధాన మంత్రి కోరినట్టు చెప్పారు. దీనికోసం టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు ఆలోచనలను ఈ సమావేశంలో వివరించినట్టు చెప్పారు. రాష్ట్రాలు, సమాఖ్య వ్యవస్థను బలోపేతం చేస్తేనే దేశం బలపడుతుందని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పినట్టు వెల్లడించారు. కేంద్ర రాష్ట్రాల అధికార విభజనలో స్థానిక ప్రాధాన్యత గల అంశాలైన వ్యవసాయం, ఆరోగ్యం, విద్య రాష్ట్రాలకే బదలాయించాలని ఈ సమావేశంలో వివరించినట్టు చెప్పారు. దీని మూలంగా వేగవంతంగా దేశాన్ని అభివృద్ధి చేసుకోవచ్చునని వెల్లడించినట్టు చెప్పారు. జమిలి ఎన్నికల విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం ఆహ్వానించదగినదని పేర్కొన్నారు. ఎన్నికల పలు దఫాలుగా జరగడం వల్ల ప్రవర్తన నియమావళి మూలంగా పరిపాలన కుంటుపడుతోందనే అభిప్రాయం ప్రజల్లో వుందన్నారు. లోక్‌సభకు, వివిధ రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికల ఖర్చు తగ్గుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్నికలలో ధన ప్రవాహాన్ని అడ్డుకోవాలంటే పరిమిత కాల వ్యవధిలో జమిలి ఎన్నికలు నిర్వహించడం మంచిదన్నారు. ఒకేసారి ఎన్నికల జరిగితే కేంద్ర, రాష్ట్రాలు బడ్జెట్ ప్రవేశపెట్టడం సులభతరమవుతుందని చెప్పారు. జమిలి ఎన్నికలు నిర్వహించడం మూలంగా ఐదేళ్లపాటు
ప్రభుత్వ ఫలాలను ప్రజలు పొందే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. జమిలి ఎన్నికల నిర్వహించేందుకు రాజ్యాగ సవరణ అవసరమైతే తమ పార్టీ పార్లమెంట్‌లో పూర్తి మద్దతు ఇస్తుందని ఆయన ప్రకటించారు. దీనికోసం కేంద్రం తొందరపడటం లేదని.. దేశహితం కోసం ఈ ప్రతిపాదన తీసుకొచ్చినట్టు ప్రధాని తమకు వివరించినట్టు చెప్పారు. రాజకీయపరంగా సిద్ధాంతపరంగా పార్టీల మధ్య వైరుధ్యాలు ఉన్నప్పటికీ రాజకీయాలకు అతీతంగా దేశ శ్రేయస్సు కోసం అందరూ కలిసిరావాలని ప్రధాని పిలుపునిచ్చారని పేర్కొన్నారు. అలాగే మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాలు జరపాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సయోధ్యతో ప్రతి రాష్ట్రంలో టార్గెట్‌గా 150 పాఠశాలలు, 150 గ్రామాలు, 150 ఆసుపత్రులను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఆదర్శవంతంగా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనలను ప్రధాని ముందుంచామని, వాటిని పరశీలిస్తామని ఆయన చెప్పినట్టు కేటీఆర్ వెల్లడించారు.

చిత్రం...ఢిల్లీలో విలేఖరులతో మాట్లాడుతున్న టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు