జాతీయ వార్తలు

వీర జవాను కుటుంబానికి రూ. 25 లక్షల ఆర్థిక సహాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్, జూన్ 19: జమ్మూ-కాశ్మీర్‌లో ఉగ్రవాదుల చేతుల్లో హతమైన ఆర్మీ జవాన్ నాయక్ అజిత్ కుమార్ సాహు కుటుంబానికి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ మొత్తాన్ని బాధిత కుటుంబానికి అందజేస్తారు. వీర జవాన్ అజిత్ కుమార్ సాహు మృతి పట్ల ముఖ్యమంత్రి పట్నాయక్ సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. దేశం కోసం సాహు ప్రాణాన్ని త్యాగం చేశారని ముఖ్యమంత్రి ప్రశంసించారు. ఉగ్రవాదుల దాడిని ముఖ్యమంత్రి పట్నాయక్ తీవ్రంగా ఖండించారు.