జాతీయ వార్తలు

సొంత టిఫిన్ బాక్సు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 19: ఏయిర్ ఇండియా విమానాల పైలట్లు ఇక మీదట సొంతంగా టిఫిను తెచ్చుకోకుండా ఆ సంస్థ త్వరలో నిషేధం విధించనున్నది. ఇటీవల ఏయిర్ ఇండియా కెప్టెన్‌కు క్యాబిన్ సిబ్బందిలో ఒక వ్యక్తితో జరిగిన తీవ్ర వాగ్వాదమే ఇందుకు కారణమని తెలిసింది. సోమవారం ఉదయం 11.40 గంటలకు బెంగళూరు నుంచి కోల్‌కత్తా వెళ్ళాల్సిన విమానం రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరాల్సి ఉంది. విమానం ఆలస్యంగా వెళ్ళాల్సి ఉన్నందున వారు విమానంలోనే కూర్చొని తమ వెంట తెచ్చుకున్న భోజనాన్ని తిన్నారు. ఆ తర్వాత ఆ టిఫిన్ బాక్సును శుభ్రం చేసి బ్యాగులో పెట్టుకోవాల్సిందిగా కెప్టెన్ ఆ క్యాబిన్‌కు చెందిన ఉద్యోగికి చెప్పడంతో, ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది. ఈ విషయం తెలుసుకున్న అధికారులు విచారణ చేపట్టారు. కాగా ఇకమీదట పైలట్లు తమ వెంట టిఫిన్ తెచ్చుకోకుండా ఆదేశించే విషయాన్ని ఆలోచిస్తున్నారు. అంతేకాకుండా పైలట్లు తమ కోసం ప్రత్యేక భోజనం, బర్గర్లు, సూప్స్ వంటివి ఆర్డర్ చేసి తెప్పించుకోకుండా ఏయిర్ ఇండియా లోగడ ఆదేశించింది.