జాతీయ వార్తలు

జమిలి ఎన్నికలతో ఓటర్లలో అయోమయమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జూన్ 20: లోక్‌సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదన ఎంతమాత్రం సమంజసం కాదని మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్.డి.దేవెగౌడ విమర్శించారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల ఓటర్లలో గందరగోళం ఏర్పడుతుందని అన్నారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ఆధునిక పరిజ్ఞానం, వనరులు అందుబాటులో లేవని, ఆధునికతను మనం ఇంకా పూర్తిగా అందిపుచ్చుకోలేదని తాను భావిస్తున్నానని దేవెగౌడ పేర్కొన్నారు. దేశంలోని అన్ని పార్టీలతో ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశం అనంతరం దేవెగౌడ స్పందించారు. ‘జమిలి ఎన్నికల ప్రతిపాదనను కొందరు వ్యతిరేకించగా, మరికొందరు ఆమోదం తెలిపారు. నిజాయితీగా ఆలోచిస్తే పోలింగ్ రోజున ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశమే ఎక్కువగా ఉంది. ఎందుకంటే శాసనసభకు ఒక పోలింగ్ బూత్, లోక్‌సభకు మరో పోలింగ్ బూత్ ఉండటమే ఈ గందరగోళానికి కారణం. ఈ రకమైన అసౌకర్యం గురించే నేను ఆందోళన చెందుతున్నాను’ అని దేవెగౌడ వ్యాఖ్యానించారు. ‘పోలింగ్ బూత్‌లవద్ద ఎన్నికల ఏజెంట్లకు అనుమతి ఉండదు కాబట్టి ఈ గందరగోళానికి ఎన్నికల కమిషన్ అధికారులే తెరదించాలి ఉంటుంది’ అని అన్నారు. లోక్‌సభ, శాసనసభ ఎన్నికలను పేపర్ బ్యాలెట్ ద్వారా నిర్వహించిన పక్షంలో ఓటర్లలో ఎలాంటి గందరగోళం ఉండదని దేవెగౌడ పేర్కొన్నారు. లోక్‌సభ, శాసనసభకు వేర్వేరుగా పేపర్ బ్యాలెట్లు ఉంటాయి కాబట్టి ఓటరు ఆ మేరకు సంబంధిత బూత్‌లో ఓటు వేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ఈవీఎంలను వినియోగిస్తున్న తరుణంలో జమిలి ఎన్నికలు నిర్వహిస్తే సమస్యలు ఎదురవుతాయని దేవెగౌడ పేర్కొన్నారు.