జాతీయ వార్తలు

లోక్‌సభకు ఆర్డినెన్స్‌ల కాపీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 20: గత ప్రభుత్వం జారీ చేసిన 10 ఆర్డినెన్స్‌ల కాపీలు లోక్‌సభకు చేరాయి. అదే విధంగా రాజ్యసభకూ ఈ కాపీలు వెళ్లాయి. పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రులు అర్జున్ రామ్ మేఘ్‌వాల్, మురళీధరన్ ఈ కాపీలను వరుసగా లోక్‌సభ, రాజ్యసభకు పంపించారు. నరేంద్ర మోదీ సారథ్యంలో బీజేపీ మరోసారి అధికారం చేపట్టిన తర్వాత గతంలో జారీ చేసిన ఆర్డినెన్స్‌లకు చట్ట రూపాన్ని ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. కొత్త పార్లమెంట్ కొలువైన 45 రోజుల్లోగా ఆర్డినెన్స్‌లకు ఆమోద ముద్ర పడకపోతే అవి చెల్లుబాటు కావు. కాబట్టి ఈలోగా ఉభయ సభల ఆమోదంతో పాటు, రాష్టప్రతి ఆమోద ముద్ర కోసం కేంద్రం తొందర పడుతోంది. ట్రిపుల్ తలాక్, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ నిబంధనల సవరణ, కంపెనీల చట్ట సవరణ, వ్యవస్థీకృతం కాని డిపాజిట్ పథకాలు, జమ్మూ కాశ్మీర్ రిజర్వేషన్ సవరణ, ఆధార్ చట్టంలో మార్పులు, స్పెషల్ ఎకనామిక్ జోన్‌ల ఏర్పాటు, కేంద్ర విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు వంటి పలు అంశాలపై గత ప్రభుత్వం ఆర్డినెన్స్‌లను జారీ చేసింది. ప్రస్తుతం ఇవి అమల్లో ఉన్నప్పటికీ చట్ట రూపం దాలిస్తేనే విలువ ఉంటుంది. ఆర్డినెన్స్‌ల గడువు ముగిసిన వెంటనే ఈ నిబంధనలు అమలు చేయడానికి వీలు ఉండదు. అందుకే వాటిని త్వరలో చట్టాలుగా మార్చాలని కేంద్రం ఆలోచన.