జాతీయ వార్తలు

సభ సజావుగా సాగేందుకు సహకరించండి: రాజ్యసభ చైర్మన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 20: రాజ్యసభ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకారం అందించాలని ఉప రాష్టప్రతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. రాజ్యసభ గురువారం ప్రారంభమైన నేపధ్యంలో వెంకయ్య నాయుడు తన నివాసంలో వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లకు విందును ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా సభా కార్యకలాపాలు సజావుగా సాగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని కోరారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు పార్లమెంట్ ప్రతిబింబమని, అక్కడ జరిగే చర్చలు, ప్రజల భవిష్యత్తును నిర్దేశిస్తాయని, సభలో అందరూ సవ్యంగా నడుచుకోవాలని అన్నారు. ఎగువ సభలో జరిగే చర్చలు అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఆదర్శంగా నిలుస్తాయని, అందుకే అర్థవంతమైన, నిర్మాణాత్మకమైన చర్చలకు అన్ని పార్టీల సభ్యులు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత మొదలైన ఈ పార్లమెంట్ సమావేశాలు నిర్మాణాత్మకంగా ముందుకు సాగుతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.