జాతీయ వార్తలు

పిల్లలకూ బెర్త్ రేట్లు తప్పవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: ఇక పిల్లలతో రైళ్లలో రిజర్వుడు బెర్త్‌లు, సీట్లలో ప్రయాణించాలంటే పూర్తి చార్జి కట్టాల్సిందే. నిన్నమొన్నటి వరకూ ఐదునుంచి పనె్నండేళ్లలోపు పిల్లలకు రిజర్వేషన్లకు సంబంధించి సగం ధరే ఉండేది. ఇటీవల రైల్వే మంత్రి ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ప్రతిపాదన శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. సవరించిన ఈ ధరల ప్రకారం ఐదు నుంచి పనె్నండేళ్ల పిల్లలకు రిజర్వుడు క్లాసులో సీటు లేదా బెర్త్ కావాలంటే టికెట్ రిజర్వేషన్ సమయంలోనే పూర్తి రేటు చెల్లించాల్సి ఉంటుంది. ఈ వయసు పిల్లలకు అన్ రిజర్వుడు టికెట్ల చార్జీలపై మాత్రం ఎలాంటి మార్పూ ఉండదు. సగం ధరకే వీటిలో పిల్లలు ప్రయాణించవచ్చు. ఒకవేళ ఈ వయసు పిల్లలకు రిజర్వేషన్ అవసరం లేదనుకుంటే మామూలుగా టికెట్ ధరలో సగం ధరే వర్తిస్తుంది. రిజర్వేషన్ సమయంలోనే ఈ విషయాన్ని ప్రయాణికులు స్పష్టం చేసే విధంగా సంబంధిత ఫారంలో మార్పులు తెస్తున్నారు. ఎప్పటిలాగే ఐదేళ్లలోపు పిల్లలు బెర్త్ లేకుండా ఉచితంగానే ప్రయాణించొచ్చు.