జాతీయ వార్తలు

కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనర్, జూన్ 23: జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని షాపియాన్ జిల్లా పరిధిలో ఆదివారం భద్రతా దళాలతో జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు స్థానిక ఉగ్రవాదులు హతులయ్యారు. సైనికాధికారుల కథనం మేరకు ఉగ్రవాదులు ఉన్నారన్న విశ్వసనీయ సమాచారం అందుకున్న భద్రతా దళాలు షాపియాన్ జిల్లా పరిధిలోని ధరమ్‌దోరా ప్రాంతంలో కార్డన్ సెర్చ్‌ను నిర్వహించాయి. ఈ సందర్భంగా ఉగ్రవాదులు ఒక్కసారిగా భద్రతా దళాలపై కాల్పులకు తెగబడ్డాయి. దీంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులకు దిగాయి. ఈ సందర్భంగా జరిగిన హోరాహోరా కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. మృతులను రఫిహసన్ మీర్, సుహాలీ అహ్మద్ భట్, షౌకత్ అహ్మద్ మీర్, ఆజాద్ అహ్మద్ ఖాండేగా పోలీసులు గుర్తించారు. ఇందులో షౌకత్ అహ్మద్ మీర్ 2015లో సాయుథ మిలిటెంట్ ర్యాంకింగ్స్‌లో చేరగా మిగిలిన ముగ్గురు ఇటీవలే అతనికి జతకలిశారు. వీరిని ఉగ్రవాదంలోకి తీసుకురావడంలో షౌకత్ అహ్మద్ మీర్ కీలకంగా వ్యవహరించాడు. షౌకత్ ఆరంభ దశలో హిజ్బుల్ ముజాహిదీన్‌కు అనుబంధంగా పనిచేశాడు. కాగా మృతులంతా అల్‌ఖైదాకు అనుబంధ విభాగం అన్సార్ గజ్వతుల్ హింద్‌కు అనుంబంధంగా పనిచేస్తున్నట్టు సమాచారం
చిత్రం... శోపియా జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్ ప్రాంతానికి వెళుతున్న జవానులు