జాతీయ వార్తలు

అలహాబాద్ హైకోర్టు జడ్జిని తొలగించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 23: శాఖాపరమైన విచారణ కమిటీ జరిపిన అంతర్గత విచారణలో దుష్ప్రవర్తనకు పాల్పడినట్టు తేలడంతో అలహాబాద్ హైకోర్టుకు చెందిన జస్టిస్ ఎస్.ఎన్.శుక్లాను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ప్రధానికి ఒక లేఖ రాశారు. మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇందిరా బెనర్జీ, సిక్కిం హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్.కె.అగ్నిహోత్రి, మధ్యప్రదేశ్ హైకోర్టుకు చెందిన జస్టిస్ పి.కె. జైస్వాల్‌తో కూడిన ముగ్గురు జడ్జిలు గల శాఖాపరమైన విచారణ కమిటీ గత ఏడాది జనవరిలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి ఎస్.ఎన్. శుక్లాపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిందని సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి గొగోయ్ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. శుక్లాపై వచ్చిన ఆరోపణలు అసాధారణ రీతిలో ఉండడంతో అతనిని తొలగించేందుకు తగిన ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. ఆ త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం అప్పటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా సైతం శాఖాపరమైన నిబంధనలకు అనుగుణంగా జస్టిస్ శుక్లా తన ఉద్యోగానికి రాజీనామా చేయడం లేదా తక్షణమే వలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడం గానీ చేయాలని సూచించిన విషయాన్ని సీజే పేర్కొన్నారు. అయితే, జస్టిస్ శుక్లా తన ఉద్యోగానికి రాజీనామా చేయడానికి గానీ వలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడానికి గానీ నిరాకరించడంతో తక్షణమే శుక్లాను విధుల నుంచి తప్పించాలని అలహాబాద్ హైకోర్టుకు అప్పటి సుప్రీం సీజే సూచించారని గొగోయ్ తెలిపారు. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో జస్టిస్ శుక్లా దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారని తెలిపారు. మార్చి 23న జస్టిస్ శుక్లా సుప్రీం సీజేకి రాసిన ఒక లేఖలో అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ తనను విధుల నుంచి తప్పుకోవాలని రాసిన లేఖను పొందుపరిచిన విషయాన్ని ఆయన పేర్కొన్నారు.
ఇదిలావుండగా, ‘జస్టిస్ శుక్లాపై వచ్చిన ఆరోపణలను శాఖాపరమైన విచారణ కమిటీ నిర్ధారించిన నేపథ్యంలో అతనిని తొలగించేందుకు తగిన ప్రతిపాదనలు రూపొందించాలి. అంతేకాకుండా అతనిని ఏ హైకోర్టులోనూ మళ్లీ న్యాయవిధుల్లో పనిచేయకుండా నిరోధించాలి. జరిగిన ఈ పరిణామాలన్నింటినీ గమనంలోకి తీసుకుని జస్టిస్ శుక్లాపై తక్షణం చర్యలు తీసుకోండి’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.