జాతీయ వార్తలు

పోలవరానికి 18వేల కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,సెప్టెంబర్ 6: కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా చేపట్టిన పోలవరానికి నాబార్డ్ నుండి పద్దెనిమిది వేల కోట్ల రూపాయల రుణం అందుతున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 19 జరిగే కృష్ణా జలాల అపెక్స్ కమిటీ సమావేశానికి హాజరయ్యేందుకు ఢిల్లీకి వచ్చినప్పుడు నాబార్డ్‌తో పోలవరం రుణంపై సంయుక్త ఒప్పందం జరుగుతుందని చెబుతున్నారు. దేశంలోని తొంబై తొమ్మిది ప్రాజెక్టులకు నాబార్డ్ రుణం మంజూరు చేయటంపై మంగళవారం కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి సమక్షంలో ఒక త్రైపాక్షిక ఒప్పందం జరగటం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన 99 నీటిపారుదల ప్రాజెక్టుల్లో ఆంధ్రకు సంబంధించినవి ఎనిమిది ఉన్నాయి. వీటిలో గుండ్లకమ్మ, తాటిపూడి, తోటపల్లి, తారకరామ తీర్థ సాగరం, ముసురుమిల్లి, పుష్కర, ఎర్రకాల్వ, మద్దిగడ్డ ఉన్నాయి. వీటికి నాబార్డు నుంచి ప్రత్యేక రుణసాయం అందుతుంది. పోలవరం ప్రాజెక్టుకు నాబార్డ్ 18 వేల కోట్ల రుణం అందజేసేందుకు
సంబంధించిన ట్రైపార్టైట్ ఒప్పందం ఈనెల 19న జరుగుతుందని అంటున్నారు. కృష్ణా జలాల వినియోగంపై తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య తలెత్తిన సమస్యల గురించి చర్చించేందుకు ఉమాభారతి కృష్ణా జలాల అపెక్స్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల 11,18 లేదా 19 తేదీల్లో ఏదోఓక రోజు అపెక్స్‌కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు రావాలని ఉమాభారతి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాయటం తెలిసిందే. 11, 12 తేదీలు ఆదివారాలు కావటంతో 19 తేదీ వచ్చేందుకు వీలు పడుతుందని చంద్రబాబునాయుడు కేంద్ర మంత్రికి లేఖ రాసినట్లు తెలిసింది. తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా సెప్టెంబర్ 19 తేదీకే సానుకూలత చూపించవచ్చునని అంటున్నారు. ఉమాభారతి అధ్యక్షతన జరిగే ఈ అపెక్స్ కమిటీ సమావేశంలో కృష్ణా జలాలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య తలెత్తిన సమస్యల గురించి చర్చించనున్నారు. చంద్రబాబునాయుడు ఈనెల 19 డిల్లీకి వస్తున్నందున అదే రోజు పోలవరం ప్రాజెక్టు రుణానికి సంబంధించి నాబార్డ్‌తో ట్రైపార్టైట్ ఒప్పందం వ్యవహారాన్ని పూర్తి చేయాలని ఉమాభారతి భావిస్తున్నట్లు తెలిసింది.