జాతీయ వార్తలు

అంబేద్కర్ వర్శిటీలో ఈడబ్ల్యూఎస్ కోటా 10 శాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 25: ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూసీ) పది శాతం రిజర్వేషన్ అమలు చేయనున్నట్లు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్శిటీ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. దీనికి సంబంధించి పోర్టల్‌ను బుధవారం ప్రారంభించనుంది. కాగా, యూజీ కోర్సులకు సంబంధించి మే మూడో తేదీ, పీజీ కోర్సులకు మే రెండో తేదీ నుంచి దరఖాస్తులు అందుబాటులో ఉండగా సోమవారంతో గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న పోర్టల్ బుధవారం నుంచి అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఆయా కోర్సులకు సంబంధించి దరఖాస్తు చేసిన వారు మరోసారి దరఖాస్తు చేయనవసరం లేదు. ఈ విద్యా సంవత్సరం నుంచే ఈడబ్ల్యూసీ కోటా అమల్లోకి వస్తుంది.