జాతీయ వార్తలు

‘వెస్ట్ బంగ్లాదేశ్’ చేయాలని చూస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 25: పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని ‘పశ్చిమ బంగ్లాదేశ్’గా మార్చాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చూస్తున్నారని బీజేపీ మంగళవారం తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించింది. లోక్‌సభను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే కార్యక్రమంలో బీజేపీ సభ్యులు పై విధంగా వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్‌లో ప్రజాస్వామ్యం పూర్తిగా గాడి తప్పిందని ఎంపీ దిలీప్ ఘోష్ పేర్కొన్నారు. ‘‘పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాన మంత్రి కావాలని ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు.. బంగ్లాదేశ్‌ను, పశ్చిమ బెంగాల్‌ను కలిపి ‘వెస్ట్ బంగ్లాదేశ్’గా మార్చాలని మమత యోచిస్తున్నారు.’’ అని ఎంపీ ఆరోపించారు. భారత్ నుంచి బెంగాల్‌ను విడదీసేందుకు కుట్ర జరుగుతోందని ధ్వజమెత్తారు. జై శ్రీరాం అన్నది బీజేపీ నినాదమేననీ.. శాంతి భద్రతలు, న్యాయ పరిరక్షణ అన్నది రాముడి ముఖ్య ఉద్దేశమని.. అది రాష్ట్రంలో ఉండాలన్నదే బీజేపీ ధ్యేయమని అన్నారు. అయితే, బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లను ప్రోత్సహిస్తూ ‘వెస్ట్ బంగ్లాదేశ్’గా మార్చాలని మమత ప్రభుత్వం యత్నిస్తోందని ధ్వజమెత్తారు. కాగా, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా మాట్లాడుతూ అయోధ్యలో వివాదాస్పద 2.77 ఎకరాల భూమి అంశాన్ని రాజకీయం చేయాలని 2014 నుంచి బీజేపీ యోచిస్తోందని ఆరోపించారు. కేవలం ఒక కమ్యూనిటీని లక్ష్యంగా చేసుకొని పౌరసత్వ సవరణ బిల్లును తేవాలని బీజేపీ ప్రయత్నిస్తోందని, ఎన్నికల విధానంలో బీజేపీ తీసుకొచ్చిన మార్పులు భారత్‌ను ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టివేస్తున్నాయని ధ్వజమెత్తారు.