జాతీయ వార్తలు

హిందీని బలవంతంగా రుద్దితే ఊరుకోం: సీపీఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 25: దేశ వ్యాప్తంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు(యూజీ)ల్లో హిందీ అమలు తప్పనిసరి చేయాలన్న ప్రయత్నాలను భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్ట్) తీవ్రంగా వ్యతిరేకించింది. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) ప్రతిపాదనలు వివిధ భాషలకు నిలయమైన భారత్‌లో ప్రతికూల ప్రభావం చూపుతాయని సీపీఎం పొలిట్‌బ్యూరో స్పష్టం చేశారు. డిగ్రీ కోర్సుల్లో హిందీ అమలును తప్పనసరి చేయాలంటూ యూజీసీ దేశంలోని అన్ని వర్శిటీలకు గత ఏడాది లేఖలు రాసింది. దీనిపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. యూజీసీ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. హిందీని బలవంతంగా రుద్దాలన్న నిర్ణయాన్ని గతంలోనూ వామపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయని సీపీఎం పోలిట్‌బ్యూరో గుర్తుచేసింది. యూజీసీ ప్రతిపాదనలు తక్షణం ఉపసంహరించుకోవాలని మంగళవారం పార్టీ ఓ ప్రకటనలో డిమాండ్ చేసింది. ‘్భరత్ వివిధ భాషలు, సంస్కృతులలో అలరారుతోంది. అలాగే వైవిధ్యంతో కూడిన పరిస్థితులున్నాయి. అలాంటి పరిస్థితుల్లో జాతీయత పేరుతో ఒక భాషను బలవంతంగా రుద్దాలన్న ఆలోచన సరైందికాదు. ఇది దేశ ఐక్యతనే దెబ్బతీస్తుంది’అని సీపీఎం ఆందోళన వ్యక్తం చేసింది. హిందీని కచ్చితంగా అమలుచేయాలన్న ఆలోచన తేనెతుట్టెను కదుపుతుందని పార్టీ హెచ్చరించింది. దీనిపై మేధావి వర్గం, విద్యార్థి సంఘాలు, సంస్థలు అప్రమత్తంగా ఉండాలని పార్టీ పిలుపునిచ్చింది. కాగా యూజీసీది ఏకపక్ష నిర్ణయని శుక్రవారం జరిగిన ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం ఆరోపించింది. తక్షణం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.