జాతీయ వార్తలు

హోదా ఇవ్వనందుకే ఏపీలో బీజేపీ ఘోరంగా ఓడింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 25: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వనందుకే రాష్ట్రంలో బీజేపీ ఘోరంగా ఓడిపోయిందని లోక్‌సభలో తెలుగుదేశం పక్షం నాయకుడు గల్లా జయదేవ్ చెప్పారు. రాష్టప్రతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో పాల్గొంటూ- ప్రత్యేక హోదా కోసం తెలుగుదేశం ఎంత పోరాడినా బీజేపీ ఇవ్వలేదు.. దానిమూలంగా తమ పార్టీకీ నష్టం కలిగిందని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ, హక్కుల సాధన కోసం తెలుగుదేశం పోరాటం కొనసాగిస్తుందని ఆయన ప్రకటించారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను ఎంతకాలం జాప్యం చేస్తారని జయదేవ్ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. లోక్‌సభ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించిన బీజేపీ ఏపీలో ఎందుకు ఓడిపోయిందో ఆ పార్టీ నాయకత్వం ఆలోచించాలని ఆయన సూచించారు. ఏపీలో బీజేపీ ఒక్క అసెంబ్లీ సీటు, ఒక్క లోక్‌సభ సీటును కూడా గెలవలేకపోయిందంటే ప్రజలు ఆ పార్టీపట్ల ఏ స్థాయిలో ఆగ్రహంతో ఉన్నారనేది స్పష్టమవుతోందని జయదేవ్ చెప్పారు. బీజేపీ, టీడీపీ వివాదాల మూలంగా జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగుపడిందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఇటీవల ఢిల్లీకి వచ్చి ప్రధాన మంత్రిని కలిసిన అనంతరం ప్రత్యేక హోదా కోసం ప్రయత్నిస్తూనే ఉంటామని చెప్పటం విచిత్రంగా ఉన్నది.. ప్రయత్నిస్తూ ఉంటామంటే హోదా రానట్లే కదా అని జయదేవ్ అన్నారు. ప్రత్యేక హోదా పేరుతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు రాకపోవచ్చుననే విధంగా మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించటం సిగ్గుచేటని ఆయన దుయ్యబట్టారు. మోదీ హయాంలో అందరి వికాసం సాధ్యం కాకపోవచ్చుననే అనుమానాలు కలుగుతున్నాయని ఆయన అన్నారు.