బిజినెస్

ప్రజల ముందు ఎగవేతదారుల వివరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 26: భారీ మొత్తంలో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగవేస్తున్న వారి వివరాలు ప్రజల ముందు పెట్టాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడిటి) ఆదాయ పన్ను శాఖను ఆదేశించింది. రుణ ఎగవేతదారుల ఆస్తులను, అకౌంట్లనూ వెల్లడించాలని సూచించింది. ఇలా చేయడం ద్వారా వారిపై వత్తిడి పెరిగి, ప్రజాధనాన్ని వసూలు చేసేందుకు వీలవుతుందని అభిప్రాయపడింది. దీంతో ఐటీ శాఖ కదిలింది. ఈ మేరకు బుధవారం ఫీల్డ్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రుణాలు పొంది సమయానికి చెల్లించకుండా ఎగవేస్తున్న వారి వివరాలు వెల్లడించాలని పేర్కొంది. కాబట్టి పన్ను ఎగవేతదారులు దీనిని దృష్టిలో పెట్టుకోవాలని సీబీడిటి వెల్లడించింది. బ్యాంకుల నుంచి రుణాలు పొంది పన్ను ఎగవేసిన వారిలో పలువురు ముందుకు వచ్చి రుణాల మొత్తాలను చెల్లిస్తున్నట్లు తెలిపింది. ప్రముఖలైన వారిలో నీరవ్ మోదీ, మెహుల్ చౌక్సీ, విజయ్ మాల్యా ప్రభృతులు ఉన్నారని పేర్కొంది.