జాతీయ వార్తలు

దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తామని, విదేశాలతో చేసుకునే ఒప్పందాలు కూడా ఈ లక్ష్యానికి అనుగుణంగానే ఉంటాయని భారత విదేశాంగ మంత్రి జై జయశంకర్ స్పష్టం చేశారు. అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పొంపియోతో బుధవారం సమావేశమైన పలు అంశాలపై చర్చించారు. ద్వైపాక్షిక సంబంధాలు, వ్యూహాత్మక పరస్పర సహకారం తదితర అంశాలు ఈ చర్చలో చోటు చేసుకున్నాయి. రష్యా నుంచి ఎస్ 400 క్షిపణి రక్షణ వ్యవస్థను భారత్ కొనుగోలు చేయడం పట్ల అమెరికా అసంతృప్తితో వున్న విషయం తెలిసిందే. అయితే దీనివల్ల అమెరికాతో దైపాక్షిక సంబంధాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని జయశంకర్ స్పష్టం చేశారు. భారత్‌కు అన్ని విధాలా వ్యూహాత్మక భాగస్వామిగా అమెరికా కొనసాగుతున్నదని, భవిష్యత్తులో రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలు మరింత మెరుగు పడతాయన్న నమ్మకం తనకు ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. రక్షణ వ్యవస్థకు సంబంధించి రష్కా, చైనా, ఉత్తరప్రదేశ్ తదితర దేశాలతో ఒప్పందం కుదుర్చుకున్న దేశాలపై అమెరికా ఆంక్షలు విధిస్తున్నది. ఉత్తర కొరియా, ఇరాన్ తదితర దేశాలపై ఇప్పటికే ఆంక్షల కొరడా ఝుళిపించింది. అయితే అమెరికాతో భారత్‌కు ఉన్న మైత్రి సంబంధాలు నిన్న మొన్నటివి కావని జయశంకర్ అన్నారు. దేశ ప్రయోజనాల కోసమే నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు. ఇందులో భాగంగానే రష్యా నుంచి క్షిపణి రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఇలాంటి ఒప్పందాలను దాదాపు అన్ని దేశాలు కుదుర్చుకుంటాయని అన్నారు. జాతి ప్రయోజనాల కోసం తీసుకునే నిర్ణయాలు స్వాగతించాల్సిన అవసరం ఉందని అన్నారు. కీలక అంశాలపై ఇరుదేశాల మధ్య సత్ఫలితాలు జరుగుతాయని ఆయన తెలిపారు.
వ్యూహాత్మక భాగస్వామ్యమే లక్ష్యం: ప్రధాని
అమెరికా ప్రభుత్వ కార్యదర్శి మైక్ పాంపియో బుథవారం నాడిక్కడ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. రెండో దఫా ఏర్పాటైన తన ప్రభుత్వం అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కోరుకుంటోందన్న అభిప్రాయాన్ని ఈ సందర్భంగా మొదీ తన నిశ్చితాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వాణిజ్య, ఆర్థిక, విద్యుత్, రక్షణ, ఉగ్రవాద నియంత్రణలతోబాటు ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలు తదితర అంశాల్లో ద్వైపాక్షిక బంధాలు పూర్తి స్థాయిలో బలంగా ఉండాలన్న విషయానికి తాను కట్టుబడి ఉన్నానని మోదీ తెలిపారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకునేందుకు సంబంధించిన అనేక అంశాలపై ఈ సందర్భంగా మోదీ, పాంపియో మధ్య జర్చలు జరిగాయి. ప్రధానంగా గట్టి నమ్మకం, ఇరువైపుల ఆసక్తితోనే ద్వైపాక్షిక బంధా లు బలోపేతం అవుతాయని మోదీ తన నిశ్చితాభిప్రాయాన్ని తెలియజేశారు. భారత్‌తో సంబంధాలు బలోపేతమై కొనసాగాలన్నదే అమెరికా ప్రభుత్వ లక్ష్యమని, మంచి భవిష్యత్ దృక్పథంతో లక్ష్యాల సాధనకు కలిసి పనిచేసేందుకు తమ దేశం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా పాంపియో తెలియజేశారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తరపున పాంపియో భారత ప్రధాని మోదీకి అభినందనలు తెలియజేశారు. ప్రతిగా తన ధన్యవాదాలను ట్రంప్‌కు అందజేయాల్సిందిగా పాంపియోను మోదీ కోరారు. కాగా మంగళవారం రాత్రి భారత్ చేరుకున్న పాంపియో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌తో సమావేశమై అనేక అంశాలపై చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకునేందుకు అనుసరించాల్సిన విధానలపై ఈ సందర్భంగా చర్చలు జరిగాయి. ఈ వారంలోనే జపాన్‌లోని ఒసాకాలో జరుగనున్న జీ-20 దేశాల శిఖరాగ్ర సదస్సులో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను భారత ప్రధాని నరేంద్ర మోదీ కలుసుకుని చర్చలు జరుపుతారని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్న క్రమంలో పాంపియో రాక ప్రాధాన్యతను సంతరించుకుంది. మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా, భారత్ మధ్య జరుగుతున్న తొలి అత్యున్నత స్థాయి చర్చలు ఇవే కావడం గమనార్హం.

చిత్రం...అమెరికా మంత్రి మైక్ పొంపియోను కలుసుకున్న భారత విదేశాంగ మంత్రి జైశంకర్