జాతీయ వార్తలు

భార్య హత్య కేసులో న్యాయమూర్తి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, సెప్టెంబర్ 8: గుర్గావ్‌లో సంచలనం రేపిన గీతాంజలి గర్గ్ హత్యకేసు అనూహ్య మలుపు తిరిగింది. 30ఏళ్ల గర్గ్ హత్య కేసులో ఆమె భర్త, సివిల్ జడ్జి రవ్‌నీత్ గర్గ్‌ను బుధవారం రాత్రి సిబిఐ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం రవ్‌నీత్‌ను పంచకుల సిబిఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా ఐదు రోజుల రిమాండ్ విధించారు. హర్యానాలో పంచకులకు చెందిన 30 ఏళ్ల గీతాంజలి జూలై 17న అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గట్టి భద్రత ఉండే గుర్గావ్ పోలీసు లైన్‌లో భర్తతో కలిసి ఆమె ఉంటోంది. దీన్ని అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు. గీతాంజలి పోస్టుమార్టం నివేదికలో ఆమె కడుపులో బుల్లెట్ గాయం కనిపించింది. అలాగే గడ్డం కింది నుంచి తలలోకి మరో బుల్లెట్ దూసుకుపోయినట్టు పోస్టు మార్టం నివేదికలో వెల్లడైంది. మెడపై మరో బుల్లెట్ గాయం ఉంది. తొలుత గీతాంజలి మృతిని పోలీసులు ఆత్మహత్యగా భావించారు. అయితే అల్లుడే తమ కుమార్తెను హత్యచేశాడని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. దీంతో సివిల్ జడ్జి, అతడి కుటుంబ సభ్యులపై హత్య కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గీతాంజలి మృతిపై అనేక అనుమానాలు తలెత్తడంతో జూలై 23న హర్యానా ప్రభుత్వం కేసును సిబిఐకి అప్పగించింది. అరెస్టయిన రవ్‌నీత్ గర్గ్ కైతాల్ జిల్లా కోర్టులో (సీనియర్ డివిజన్) సివిల్ జడ్జిగా పనిచేస్తున్నాడు.

చిత్రం.. రవ్‌నీత్ గర్గ్, గీతాంజలిల పెళ్లి ఫొటో