జాతీయ వార్తలు

12లక్షల కోట్లు ఏమయ్యాయి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, సెప్టెంబర్ 8: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిప్పులు చెరిగారు. యూపీ సభల్లో ఎన్‌డిఏ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న రాహుల్ ఓసారి యుపిఏ సర్కార్ నిర్వాకం గుర్తుచేసుకోవాలని ఆయన యద్దేవా చేశారు. ‘ఇటలీ కళ్లద్దాలతో చూసే రాహుల్‌బాబాకు మార్పు ఎలా కనబడుతుందని’ షా వ్యంగంగా అన్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడి ఆరోపణలపై అమిత్ షా ఎదురుదాడికి దిగారు. యుపిఏ హయాంలో జరిగిన 12లక్షల కోట్ల కుంభకోణాలపై రాహుల్‌బాబా ప్రజలకు వివరించాలని బిజెపి చీఫ్ సవాల్ చేశారు. కేంద్రంలో ఎన్‌డియే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకొచ్చిందని గురువారం ఇక్కడ స్పష్టం చేశారు.
బిజెపి రెండున్నర ఏళ్ల పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ రాలేదని ఆయన అన్నారు. దక్షిణ గుజరాత్‌లోని తాపీ జిల్లా వియారా పట్టణంలో బిజెపి కార్యకర్తల సమావేశంలో అమిత్‌షా మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాతే ఇండో-పాక్ సరిహద్దులో ఉద్రిక్తతలు తగ్గాయని చెప్పారు. అయితే ఇటలీ కళ్లద్దాలు ధరించే రాహుల్‌కు మోదీ సర్కార్ సాధించిన మైలురాళ్లు కనిపించవని షా యద్దేవా చేశారు.