జాతీయ వార్తలు

మీవల్లే దేశంలో శాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, సెప్టెంబర్ 10: ఇరవై ఒకటో శతాబ్దంలో చాలా తీవ్రమైన హింస చోటుచేసుకుంటోందని, శాంతి సుస్థిరతలను కాపాడడానికి సమర్థవంతమైన, బాధ్యతాయుతమైన సాయుధ దళాలు కావాలని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. భద్రతా సవాళ్లు కేవలం సరిహద్దులకే పరిమితం కాదని, భారతీయులు ఎక్కడైతే ఎక్కువగా ఉన్నారో అక్కడ కూడా భద్రతాపరమైన ముప్పులు పొంచి ఉంటున్నాయని, ఈ సవాళ్లను అధిగమించి, తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి నిర్విరామంగా, అలుపెరగని పోరాడగల యువతీ యువకులు ఇప్పుడు దేశానికి అవసరమని అన్నారు. శనివారం ఇక్కడి ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పొందిన ఆఫీసర్ల పాసింగ్ ఔట్ పరేడ్‌లో రాష్టప్రతి పాల్గొన్నారు. ప్రకృతిపరంగా సంక్షోభాలు ఎదురయినప్పుడు, శాంతిభద్రతలకు సంబంధించిన సంక్షోభ సమయాల్లోను దేశం సైన్యంపై పూర్తి విశ్వాసం ఉంచిందని అన్నారు. ప్రజలంతా శాంతి సుఖజీవనంతో ఉండాలంటే శాంతి, సుస్థిరతలు అత్యంత కీలకమని, దీన్ని సాధించాలంటే బాధ్యతాయుతమైన, నిస్వార్థంతో పనిచేసే సాయుధ బలగాలు దేశానికి అత్యవసరమని అన్నారు. మానవాళి చరిత్రలో ఇప్పటికే ఎన్నో రకాల హింస, ఉద్రిక్తతలు సంభవించినప్పటికీ 21వ శతాబ్దంలో చాలా తీవ్రమైన హింసాకాండ చోటు చేసుకుంటోందని రాష్టప్రతి ఆందోళన వ్యక్తం చేశారు.

చిత్రం.. పాసింగ్ ఔట్ పరేడ్‌ను తిలకిస్తున్న రాష్టప్రతి ప్రణబ్, కమాండెంట్ జనరల్ బాబీ మాథ్యూస్