జాతీయ వార్తలు

వివాదంలో రాజీవ్ ఫౌండేషన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: వివాదాస్పద ఇస్లామిక్ మత బోధకుడు జాకీర్ నాయక్ నడుపుతున్న ఒక స్వచ్ఛంద సంస్థ నుంచి రూ.50 లక్షల విరాళం స్వీకరించడం ద్వారా రాజీవ్ గాంధీ ఫౌండేషన్ (ఆర్‌జిఎఫ్) వార్తల్లోకెక్కింది. అయితే రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ఆ విరాళం మొత్తాన్ని తిరిగి వెనక్కి ఇచ్చివేసింది. జాకీర్ నాయక్ ముస్లిం యువతను మత ఛాందసవాదులుగా తయారు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అందువల్ల ఆయనకు చెందిన స్వచ్ఛంద సంస్థ ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఐఆర్‌ఎఫ్)ను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ‘ప్రియర్ కేటగిరి లిస్ట్’లో పెట్టింది. ఆర్‌జిఎఫ్‌కు చెందిన రాజీవ్‌గాంధీ చారిటబుల్ ట్రస్ట్ (ఆర్‌జిసిటి)కు ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ 2011లో రూ.50 లక్షల విరాళం ఇచ్చిందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. బాలికల విద్యకోసం పాటుపడుతున్న ఆర్‌జిసిటి అవసరమైన పేదలకు వైద్య ఖర్చులను కూడా సమకూర్చి ఆదుకుంటోంది. లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థగా 2002లో ఏర్పాటయిన ఆర్‌జిసిటి దేశంలోని బడుగువర్గాల ముఖ్యంగా గ్రామీణ పేదల అభివృద్ధికోసం పనిచేస్తోంది. దేశంలోనే అత్యంత స్వల్పంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలలో ఒకటయిన ఉత్తరప్రదేశ్‌తోపాటు హర్యానాలోని పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న ప్రాంతాలలో ఈ సంస్థ పనిచేస్తోంది. ఎఫ్‌సిఆర్‌ఎ నిబంధనల కింద నమోదు చేసుకున్న స్వచ్ఛంద సంస్థ ఆర్‌జిసిటికి 2011లో తమ సంస్థ రూ.50 లక్షల విరాళం ఇచ్చిందని ఐఆర్‌ఎఫ్ అధికార ప్రతినిధి ఆరిఫ్ మాలిక్ తెలిపారు. అయితే ఆర్‌జిసిటి అదే సంవత్సరం జూలైలో ఆ విరాళం మొత్తాన్ని తిరిగి ఇచ్చివేసిందని వివరించారు. ఈ ఏడాది జూలైలో ఢాకాలోని ఒక రెస్టారెంట్‌పై ఉగ్రవాదులు దాడి చేసిన తరువాత ఆ విరాళం మొత్తాన్ని ఆర్‌జిసిటి వాపసు చేసింది. ఈ ఉగ్రవాద దాడి తరువాతనే జాకీర్ నాయక్ తన బోధనల ద్వారా ముస్లిం యువతను మత ఛాందసవాదులుగా తయారు చేస్తున్నారని, ఉగ్రవాద చర్యలకు రెచ్చగొడుతున్నారని బంగ్లాదేశ్ ఆరోపించింది. ‘మేము ఇచ్చిన విరాళాన్ని అదే ఏడాదిలో వాపసు చేశారు. కారణం ఆ ఎన్‌జిఓకే తెలియాలి. అయితే నేను అడిగేదేమిటంటే ఈ ఎన్‌జిఓను ఎందుకు విడిగా చూస్తున్నారు. మేము ఇతర ఎన్‌జిఓలకు కూడా విరాళాలు ఇచ్చాం’ అని మాలిక్ అన్నారు. ఎన్‌డిఏ ప్రభుత్వం ఎలాగయినా తమ సంస్థను నిషేధించాలనే తలంపుతో ఉందని ఆయన ఆరోపించారు. 2014 చివరలోనుంచి 2015 తొలి నెలల వరకు కొన్ని నెలల పాటు నిర్వహించిన దర్యాప్తులో తమ సంస్థకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభించలేదని ఆయన పేర్కొన్నారు. విరాళాలు ఇవ్వడం తప్పా? అని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు.