తెలంగాణ

కేంద్రం దృష్టికి ‘పసుపు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 10: పసుపు పంట సాగు, దిగుబడి, ఉత్పత్తి తదితర అంశాలపై కేంద్ర వ్యవసాయ శాఖ రెండు వారాల్లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయనుందని నిజామాబాద్ లోక్‌సభ సభ్యుడు ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సంజయ్ అగర్వాల్, ఆ శాఖ ఉన్నతాధికారులతో బుధవారం ధర్మపురి అరవింద్ సమావేశమై పసుపు పంటపై చర్చించారు. పసుపు పంటకు సంబంధించి అన్ని అంశాలపై చర్చించేందుకు కేంద్రం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయనుందని అరవింద్ పేర్కొన్నారు. ఈ సమావేశానికి తనతోపాటు మరో ఇద్దరు రైతులను మాట్లాడేందుకు కేంద్ర వ్యవసాయ అధికారులు అవకాశం కల్పించారని అరవింద్ చెప్పారు.