జాతీయ వార్తలు

షార్‌లో చంద్రయాన్ సందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, జూలై 11: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీస్ థావన్ స్పేస్ సెంటర్ (షార్)లో చంద్రయాన్-2 ప్రయోగ సందడి నెలకొంది. ఈ నెల 15న జీఎస్‌ఎల్‌వీ-మార్క్ 3-ఎం 1 రాకెట్ ద్వారా చంద్రయాన్-2 ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు. దీనికి సంబంధింని ఏర్పాట్లన్నింటిని శాస్తవ్రేత్తలు పూర్తిచేశారు. ఇప్పటికే వ్యాబ్ నుంచి రాకెట్‌ను ప్రయోగ వేదికకు తరలించి అన్ని దశలకు గ్లోబల్ పరీక్షలు విజయవంతంగా నిర్వహించి ప్రయోగానికి రాకెట్‌ను రెడీ చేశారు. ప్రయోగ సన్నాహాల్లో భాగంగా గురువారం తెల్లవారు జామున 2:51గంటలకు ప్రయోగాత్మక ప్రయోగం విజయవంతంగా (రిహార్సల్) నిర్వహించారు. రిహార్సల్‌లో భాగంగా రాకెట్‌ను మోబైల్ సర్వీసు టవర్ నుంచి ముందుకు తీసుకొచ్చి మళ్లి వెనక్కి తీసుకొని వెళ్లే ప్రక్రియను శాస్తవ్రేత్తలు విజయవంతంగా పూర్తిచేశారు. దాదాపు 4నుంచి 6గంటల సేపు ఈ రిహార్సల్‌ను నిర్వహించారు. ఆ సమయంలో రాకెట్‌లోని తలెత్తే సమస్యలను గుర్తించేందుకు ముందస్తుగా చంద్రయాన్-2కు అనేకసార్లు ప్రయోగగాత్మగ ప్రయోగాలు చేపట్టి అన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నారు. మళ్లీ సాయంత్రం రాకెట్‌లోని అన్ని వ్యవస్థల పనితీరును శాస్తవ్రేత్తలు క్షుణ్ణంగా పరిశీలించి ఏవైనా చిన్నపాటి లోపాలుంటే సరిచేస్తున్నారు. ప్రయోగానికి సంబంధించిన చివరి మిషన్ రెడీనెష్ రివ్యూ సమావేశం (ఎంఆర్‌ఆర్) శనివారం షార్‌లో డాక్టర్ బిఎన్ సురేష్ అధ్యక్షతన జరగనుంది. ఎంఆర్‌ఆర్ అనంతరం షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ ఆధ్వర్యంలో లాంచింగ్ ఆథరైజేషన్ బోర్డు వారు (ల్యాబ్) సమావేశమై సుదీర్ఘంగా చర్చించినంతరం ప్రయోగానికి సంసిద్ధత తెలపనున్నారు. అదే రోజు ఇస్రో చైర్మన్ డాక్టర్ కె శివన్ కూడా షార్‌కు చేరుకోనున్నారు. 13న ప్రీ కౌంట్‌డౌన్ నిర్వహించనున్నట్లు సమాచారం. అన్ని సజావుగా సాగితే 14న కౌంట్‌డౌన్‌ను ప్రారంభించి 15న తెల్లవారు జామున 2:51 గంటలకు షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి చంద్రయాన్-1 నింగిలోక దూసుకెళ్లనుంది. అంతరిక్షంలో ఇస్రో శాస్తవ్రేత్తల పరిశోధన మరింత పుంజుకుంది. సుమారు వెయ్యి కోట్ల చంద్రయాన్-2 ప్రాజెక్టు భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ రాకెట్‌ను రూపకల్పన చేశారు. అర్భిటర్, ల్యాండర్, రోవర్ అనే మూడు పరికరాలతో పాటు 14 ఉపకరణాలతో చంద్రయాన్-2ను రూపొందించారు. అత్యంత కీలకమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇస్రో శాస్తవ్రేత్తలు చేపడుతున్నారు. చంద్రుని పై ఉన్న దక్షిణ ధృవాన్ని చంద్రయాన్-2 పరిశోధిస్తోంది. ఇతర అగ్రరాజ్యాల సైతం ఆ ప్రదేశాన్ని ఇప్పటికు టచ్‌చేయలేదు. అర్భిటర్ పై భాగంలో ల్యాండర్‌ను అమర్చారు. ఇది అక్కడ ఉష్ణోగ్రతలను తట్టుకొనే విధంగా దాని చుట్టూ బంగారు తొడుగు వంటి ఉష్ణకవచాన్ని అమర్చి ఉన్నారు. ల్యాండర్ ఒక ర్యాంపు సాయంతో చంద్రుని పైకి చేరుతోంది.
1471కిలోల బరువుగల ఈ ల్యాండర్ చంద్రుని పై విసృతంగా పరిశోధనలు చేయడానికి ఉపయోగపడుతోంది. ఈ ప్రయోగాన్ని వీక్షించేందుకు భారత రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ 14న షార్‌కు చేరుకోనున్నారు. చంద్రయాన్-2 విజయవంతమైతే ఇతర గ్రహాల పైకి ఉపగ్రహాలను పంపి శాస్తవ్రేత్తతలు పరిశోధనలు చేయడానికి తాము ముందుంటామని నిరూపించడానికి సిధ్ధమయ్యారు. షార్‌లో రెండు వారాల నుంచి చంద్రయాన్-2 ప్రయోగ సందడి నెలకొంది.

చిత్రాలు.. చంద్రయాన్-2పై అమర్చిన విక్రమ్ లాండర్