జాతీయ వార్తలు

రైతులంటే.. ఎందుకింత నిర్లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 11: ఐదేళ్లలో వ్యాపారస్తులకు రూ.4.3లక్షల కోట్ల పన్ను రాయితీ, రూ.5.5లక్షల కోట్ల రుణాలను మాఫీచేసిన బీజేపీ ప్రభుత్వం రైతుల రుణాలను ఎందుకు మాఫీ చేయటం లేదని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిలదీశారు. గురువారం లోక్‌సభ జీరో అవర్‌లో దేశంలోని రైతులు, ముఖ్యంగా కేరళలోని వాయనాడ్ రైతులు ఆత్మహత్యలకు పాల్పడడం గురించి ప్రస్తావించారు. పంటలు దెబ్బతినటంతో రుణాలు చెల్లించలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే బీజేపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని రాహుల్ ఆరోపించారు. వాయనాడ్‌కు చెందిన ఎంకిట్టన్ అనే రైతు తీసుకున్న రుణం చెల్లించలేక నిన్న ఆత్మహత్య చేసుకున్నాడు.. దేశంలోని పలు ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు పెద్దఎత్తున జరుగుతున్నాయని రాహుల్ చెప్పారు. వాయనాడ్‌లో దాదాపు 8,500 మంది రైతులకు బ్యాంకు నోటీసులు అందాయి.. రుణాలు చెల్లించకపోతే ఇళ్లు ఖాళీ చేయిస్తామని బ్యాంకు అధికారులు రైతులను బెదిరిస్తున్నారని ఆయన చెప్పారు. సర్ఫేజీ చట్టం కింద రైతుల ఆస్తులను జప్తు చేస్తున్నారు.. ఈ కారణం చేతనే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని రాహుల్ గాంధీ చెప్పారు. కేరళలో 18 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన తెలిపారు. కేరళ ప్రభుత్వం రైతుల రుణాల చెల్లింపులపై 2019 డిసెంబర్ వరకు మారిటోరియం విధించింది.. అయితే రిజర్వు బ్యాంకు ఇందుకు అంగీకరించనందున మారిటోరియం అమలులోకి రావట లేదని రాహుల్ చెప్పారు. బడా వ్యాపారస్తుల రుణాలు మాఫీ చేయటంతోపాటు వారికి లక్షలాది కోట్ల రూపాయల పన్ను రాయితీలు ఇస్తున్న ప్రభుత్వం రైతుల రుణాలను ఎందుకు మాఫీ చేయటం లేదు? ఎందుకీ ద్వంద్వనీతి అని ఆయన నిలదీశారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదు? ఎందుకింత నిర్లక్ష్యం? అని ఆయన ప్రశ్నించారు. రైతులకు ఉపశమనం కలిగించేందుకు బడ్జెట్‌లో ఎలాంటి చర్యలు ప్రకటించకపోవటం సిగ్గుచేటని ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నరేంద్ర మోదీ ఐదేళ్ల క్రితం రైతులకు గిట్టుబాటు ధరలు, పంట రుణాల విషయంలో పలు హామీలు ఇచ్చారు.. వాటిని ఇంతవరకు ఎందుకు అమలు చేయలేదని రాహుల్ ప్రశ్నించారు. రైతుల పరిస్థితి దుర్భరంగా ఉన్నదని, వారికి ఇచ్చిన హామీలను ఇప్పుడైనా అమలు చేయాలని ఆయన ప్రధాన మంత్రిని కోరారు.
రాజ్‌నాథ్ ఖండన
బీజేపీ ప్రభుత్వం రైతులను గాలికి వదిలివేసిందంటూ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని లోక్‌సభ ఉప నాయకుడు, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. రాహుల్ చేసిన ఆరోపణలను ఆయన తిప్పికొడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాతే దేశంలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని ఆయన చెప్పారు. గిట్టుబాటు ధరలను బాగా పెంచడంతోపాటు వారి ఆదాయాన్ని రెండింతలు చేసేందుకు తమ ప్రభుత్వం పలు చర్యలు తీసుకున్నదని ఆయన తెలిపారు.

చిత్రం...గురువారం లోక్‌సభలో మాట్లాడుతున్న రాహుల్ గాంధీ