జాతీయ వార్తలు

అమరావతిలో కేంబ్రిడ్జి వర్శిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: ఏపి రాజధాని అమరావతిలో విశ్యవిద్యాలయం ఏర్పాటు, రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్చలు జరిపింది. సోమవారం కేంబ్రిడ్జ్ వర్శిటీ ప్రతినిధులతో కేంద్రమంత్రి సుజనా చౌదరి, ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ రవీంద్రబాబు, అధికారులు సమావేశం అయ్యారు. సమావేశానంతరం మంత్రి గంటా శ్రీనివాసరావు విలేఖరులతో మాట్లాడుతూ ఏపీ నూతన రాజధానిలో విశ్యవిద్యాలయం ఏర్పాటు, ఏపీలో వ్యవసాయం, వైద్య, విద్యా రంగాలలో అభివృద్ధికి ఉమ్మడిగా పనిచేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. అందులో బాగంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలు ఉమ్మడి వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. దీనికి సంబంధించి రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీల వీసీల అభిప్రాయాలను కూడా తీసుకోనున్నామన్నారు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి మాట్లాడుతూ దేశంలో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి ప్రధాన కార్యాలయం అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఈ సంవత్సరం అక్టోబరు 15లోగా కేంబ్రిడ్జ్ యూనివర్శిటీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటామన్నారు. రాష్ట్రాన్ని నాలెడ్జి స్టేట్‌గా తయారు చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. కేంబ్రిడ్జ్ యూనివర్శిటితో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవటం విద్యార్థులకు మంచి అవకాశాలు కల్పించేందుకు ఉపయోగపడుతుందన్నారు.

చిత్రం.. ఢిల్లీలో సోమవారం కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్న
కేంద్ర మంత్రి సుజనా చౌదరి, రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తదితరులు