జాతీయ వార్తలు

అంబేద్కర్ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 11: హైదరాబాద్ పంజాగుట్ట ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహాన్ని పునఃప్రతిష్టించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు దేశ రాజధానిలో దీక్షకు చేపట్టారు.
పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడాన్ని నిరసిస్తూ జంతర్‌మంతర్ వద్ద గురువారం హనుమంతరావు, జీవీ హర్షకుమార్ ఒక రోజు నిరసనదీక్ష చేశారు. ఈ దీక్షకు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ఆర్సీ కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, లోక్‌సభ సభ్యుడు జయ్‌కుమార్, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఢిల్లీ యూనివర్సిటీ, జెఎన్‌టీయు విద్యార్థులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ దళితుల నేత, రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులను చిన్నచూపు చూస్తున్నారనడానికి విగ్రహం తొలగింపే నిదర్శనమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అంబేద్కర్ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలని ఆయన డిమాండ్ చేశారు. హర్షకుమార్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో అంబేద్కర్ విగ్రహాలకు అవమానాలు జరగడం దారుణమన్నారు. ఉద్దేశ్యపూర్వకంగానే ఈ విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం తొలిగించిందని హర్షకుమార్ ఆరోపించారు. ఈ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తానని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అనంతరం హనుమంతరావు, హర్షకుమార్‌లకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు.
చిత్రం... ఢిల్లీలో దీక్ష చేపట్టిన కాంగ్రెస్ నేత హనుమంతరావుకు నిమ్మరసం ఇచ్చి
దీక్షను విరమింపజేస్తున్న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి