జాతీయ వార్తలు

పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు నిధులివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 11: తెలంగాణలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని టీఆర్‌ఎస్ లోక్‌సభ సభ్యులు మనె్న శ్రీనివాస్‌రెడ్డి, పీ.రాములు కేంద్రాన్ని కోరారు. కేంద్ర ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌పై లోక్‌సభలో జరిగిన చర్చలో టీఆర్‌ఎస్ ఎంపీలు పాల్గొన్నారు. మహబూబ్‌నగర్ ఎంపీ మనె్న శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రైల్వే పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయాలని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని, రైల్వే శాఖ మంత్రికి పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చారన్నారు. ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ఎప్పటినుంచో కోరుతున్నా ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉందన్నారు. ఖాజీపెట్ డివిజన్ ఏర్పాటు కూడా చేయాలని మనె్న డిమాండ్ చేశారు. నాగర్‌కర్నూలు ఎంపీ పీ.రాములు మాట్లాడుతూ భద్రాచలం-సత్తుపల్లి-కొవ్యూరు రైల్వేలైన్ పనులు.. గద్వాల్-మాచర్ల రైల్వేలైన్ త్వరగా పూర్తిచేయాలని కేంద్రాన్ని కోరారు. 95 కి.మీ పొడవున్న లింగపేట-జగిత్యాల-నిజమాబాద్ రైల్వేలైన్‌కు రూ.80.29 కోట్ల మంజూరయ్యయని, ఈ లైన్‌ను త్వరితగతిన పూర్తిచేయాలని రాములు కోరారు.