జాతీయ వార్తలు

రాష్ట్రంలో రైల్వేను అభివృద్ధి చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 11: ఆంధ్రప్రదేశ్‌లో రైల్వేల అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలుగా కృషి చేయాలని తిరుపతి వైసీపీ లోక్‌సభ సభ్యుడు బల్లిం దుర్గా ప్రసాద్ డిమాండ్ చేశారు. కోటిపల్లి-నర్సాపూరం రైల్వేలైన్ త్వరితగతిన పూర్తి చేసేందుకు కేంద్రం పెద్దఎత్తున నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. లోక్‌సభలో గురువారం రైల్వే పద్దులపై జరిగిన చర్చలో బల్లి దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు. గుత్తి-్ధర్మవరం డబ్లింగ్ రైల్వేలైన్‌కు పూర్తిచేసేందుకు ఈ ఏడాది కేవలం రూ.120 కోట్ల కేటాయించారని, ఈ లైన్ త్వరగా పూర్తిచేసేందుకు మరిన్ని నిధులు విడుదల చేయాలని కోరారు. విజయవాడ-ఖాజీపేట రైల్వేలైన్‌కి అభివృద్ధికి ఈ బడ్జెట్‌లో కేటాయించిన నిధులు సరిపోవని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.