జాతీయ వార్తలు

ఆవు అడిగితే.. ఎద్దు ఇచ్చారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 11: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రానికి ప్రత్యేక రైల్వే జోన్‌ను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఎన్నికల అనంతరం దీని సంగతి మరిచిపోయిందని తెలుగుదేశం సభ్యుడు కింజారపు రామ్మోహన్ నాయుడు దుయ్యబట్టారు. గురువారం లోక్‌సభలో రైల్వే పద్దులపై జరిగిన చర్చలో పాల్గొంటూ రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీని ఇంతవరకు పూర్తిస్థాయిలో అమలు చేయకపోవటం సిగ్గుచేటని విమర్శించారు. రైల్వే జోన్‌లో రాష్ట్రంలోని నాలుగు డివిజన్లు వాల్తేర్, గుంతకల్, గుంటూర్, విజయవాడలను కలిపి వాల్తేర్‌ను జోన్ కేంద్ర కార్యాలయం చేయాలన్నది మా డిమాండ్.. అయితే కేంద్ర ప్రభుత్వం ఇదేదీ పట్టించుకోవటం లేదని రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆవు కోరితే కేంద్ర ప్రభుత్వం ఎద్దునిచ్చింది, మేము ఆవు అడిగితే మీరు ఎద్దును ఎందుకు ఇచ్చారంటే మీరు జంతువును అడిగారు, మేము జంతువునే ఇచ్చామంటూ కేంద్రం వాదిస్తోందని ఆయన వ్యంగ్య బాణాలు వేశారు.
ఏపీకి ఇచ్చిన జోన్‌ను నిజమైన జోన్‌గా చేయాలన్నారు. జోన్ సరిహద్దులను కూడా మారుస్తున్నారని విమర్శించారు. పలాసా తదితర ఆరు రైల్వే స్టేషన్లను కుర్దా రోడ్ నుండి తీసి విశాఖ జోన్‌లో కలపాలని అన్నారు. కొత్త జోన్‌కు బడ్జెట్‌లో నిధులు కేటాయంచలేదని అన్నారు. విశాఖ, విజయవాడలో మెట్రో రైలు ఏర్పాటు చేస్తామన్న విభజన హామీని ఇంతవరకు పూర్తి చేయలేదని రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఏపీ ఎక్స్‌ప్రెస్ సమస్యలు పరిష్కరించాలని.. విశాఖపట్నం-వారణాసి మధ్య ఒక కొత్త రైలును ఏర్పాటు చేయాలని సూచించారు.
ప్రతి సంవత్సరం కోటి మంది వారణాసికి వెళతారని.. ఎస్‌ఓబీ ఏర్పాటు చేయాలని అన్నారు. హరిశ్చంద్రపురంలో పార్కింగ్ సౌకర్యం కల్పించాలని రామ్మోహన్ నాయుడు రైల్వే శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. 18 కొత్తలైన్ల నిర్మాణం, డబ్లింగ్ పనులు చేపట్టాలని అన్నారు. అమరావతి నుండి హైదరాబాద్, తదితర ప్రాంతాలను కలిపేందుకు కనెక్టివిటీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.