జాతీయ వార్తలు

ప్రతిపక్ష ప్రభుత్వాలను కూలదోస్తున్న బీజేపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అస్థిర పరచడం, కూల్చడం వంటి చర్యలకు బీజేపీ పాల్పడుతోందని బీఎస్పీ అధినేత్రి మాయావతి మండిపడ్డారు. పార్టీ ఫిరాయించే ప్రజాప్రతినిధుల సభ్యత్వం రద్దయ్యేలా చట్టం తేవాలని గురువారం ఇక్కడ అన్నారు. కర్నాటక, గోవాలో తాజా రాజకీయ పరిస్థితులను ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలోని 16 మంది శాసన సభ్యులు రాజీనామా చేయడం, గోవాలో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడం వంటి అంశాలపై ఆమె మాట్లాడారు. ‘బీజేపీ రెండోసారి అధికారంలోకి రావడం కోసం విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లింది. అలాగే ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారు. ఇప్పుడు ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను పడగొట్టడానికి కుట్రలు చేస్తున్నారు’అని ఆమె విమర్శించారు. దేశమంతటా తామే అధికారంలో ఉండాలన్న ఏకైక లక్ష్యంతోనే నాన్ బీజేపీ ప్రభుత్వాలను అస్థిర పరుస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. ‘కర్నాటక, గోవాలో డబ్బులు ఇచ్చి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొంటున్నారు. బీజేపీ తీరు వల్ల దేశంలో ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం ఏర్పడింది. పార్టీలు మారే ప్రజాప్రతినిధులు సభ్యత్వం కోల్పోయేలా చట్టాలు తేవాలి’అని మాయావతి ట్వీట్ చేశారు.