జాతీయ వార్తలు

పోలీసు నిర్బంధం నుంచి 17 మంది విదేశీయుల పరార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నోయిడా(యూపీ), జూలై 12: సరైన పత్రాలు లేకుండా అక్రమంగా నివసిస్తున్న 60 విదేశీయులను పోలీసులు అరెస్టు చేయగా, అందులో 17 మంది పోలీసుల కళ్ళు కప్పి పారిపోయారు. తొమ్మిది దేశాలకు చెందిన 60 మంది విదేశీయులు పాసు పోర్టు, వీసా గడువు ముగిసినా నోయిడాలో అక్రమంగా నివసిస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు బుధవారం సాయంత్రం స్థానికంగా పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు. దీంతో 60 మంది పోలీసులకు పట్టుబడ్డారు. వీరందరినీ సూర్జాపూర్‌లోని రిజర్వ్ పోలీసు లైన్స్‌లో పోలీసు కస్టడీలో ఉంచారు. కాగా వీరిలో 17 మంది విదేశీయులు గురువారం రాత్రి సుమారు 8.30 గంటల ప్రాంతంలో పోలీసుల కళ్ళు కప్పి పారిపోయారని గౌతం బుద్ద నగర్ సీనియర్ సూపరింటెండెంట్ వైభవ్ కృష్ణ పీటీఐ వార్తా సంస్థ ప్రతినిధికి తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తున్నామని ఆయన చెప్పారు. నగర సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు వినీత్ జైస్వాల్ విచారణ చేస్తున్నారని ఆయన తెలిపారు.