జాతీయ వార్తలు

జాబిలి యాత్రకు రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట: జాబిలిమ్మ యాత్రకు మన శాస్తవ్రేత్తలు సర్వం సిద్ధం చేశారు. ప్రతి భారతీయుడు సగర్వంగా చెప్పుకొనే రీతిలో చందమామ రూపురేఖా విలాసాలు తెలుసుకొనే రీతిలో చంద్రయాన్-2 యాత్ర మరో మూడు రోజుల్లోనే ప్రారంభకానుంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఈ నెల 15న జీఎస్‌ఎల్‌వీ-మార్క్ 3-ఎం 1 రాకెట్ ద్వారా చంద్రయాన్-2 ఉపగ్రహ ప్రయోగం చేపట్టునున్నారు. ప్రయోగానికి సంబంధించిన చివరి మిషన్ రెడీనెష్ రివ్యూ సమావేశం శనివారం షార్‌లో డాక్టర్ బిఎన్ సురేష్ అధ్యక్షతన జరగనుంది. ఎంఆర్‌ఆర్ అనంతరం షార్ డైరెక్టర్ రాజరాజన్ ఆధ్వర్యంలో లాంచింగ్ ఆథరైజేషన్ బోర్డు (ల్యాబ్) సమావేశమై సుదీర్ఘంగా చర్చించనున్నారు. వీరి ఆధ్వర్యంలో మరోసారి ప్రయోగాత్మక ప్రయోగం (రిహార్సల్) నిర్వహించి ప్రయోగానికి సంసిద్ధత ఇవ్వనున్నారు. అనంతరం కౌంట్‌డౌన్ ప్రారంభించి 15న తెల్లవారు జామున 2:51గంటలకు షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి చంద్రయాన్-2 నింగిలోకి ఎగరనుంది. ఇప్పటికే 2008లో చంద్రయాన్-1 మిషన్‌ను కూడా ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే. ఆ దిశగా మళ్లీ జాబిలమ్మ పై పరిశోధనకు ఇస్రో అనేక సవాల్‌ను స్వీకరించి ఏర్పాట్లు చేస్తోంది. చంద్రయాన్-2 మిషన్‌లో అర్బిటర్, రోవర్, ల్యాండర్‌ను చంద్రుని పైకి పంపి పరిశోధనలు చేయనున్నారు. అర్బిటర్‌లో రోవర్, ల్యాండర్‌ను అమర్చి అది కక్ష్యలోకి చేరిన వెంటనే రోవర్ రెక్కలు విరుచుకొని ల్యాండర్ సాయంతో చంద్రుని దక్షిణ ధ్రువం వైపు చేరుతుంది. 15న యాత్ర ప్రారంభించి ఐదు రోజుల తర్వాత భూ నియంత్రిత కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. చంద్రయాన్-2 ప్రయోగం పై ఇస్రో పదేళ్లు కసరత్తుచేసింది. ఇప్పుడు ఆ కల నెరవేరనుంది. ఈ ప్రయోగ వ్యయం మొత్తం రూ.978కోట్ల వ్యవయాన్ని ఖర్చుచేసి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో చంద్రయాన్-2 మిషన్‌ను రూపకల్పనం చేశారు. ప్రయోగ దృష్ట్యా శనివారం ఇస్రో చైర్మన్ డాక్టర్ కె శివన్ చేరుకొని ప్రయోగ ఏర్పాట్లను సమీక్షించనున్నారు.
రాష్టప్రతి రాక
చంద్రయాన్-2 ప్రయోగాన్ని వీక్షించేందకు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింగ్ 14న షార్‌కు రానున్నారు. 13న ఆయన తిరుమలకు చేరుకొని తిరుమలేశుని దర్శించుకొని ఆ రాత్రికి అక్కడే బసచేస్తారు.
14న సాయంత్రం తిరుమల నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో సాయంత్రం 4:30గంటలకు నేరుగా షార్‌కు చేరుకోనున్నారు. అక్కడ హెలిప్యాడ్ వద్ద రాష్ట్ర గవర్నర్ నరసింహన్, రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, ఇస్రో చైర్మన్ డాక్టర్ కె. శివన్ స్వాగతం పలకనున్నారు.
హెలిప్యాడ్ నుంచి రాష్ట్రపతి షార్‌లో ఉన్న నక్షత్ర అతిథిగృహానికి చేరుకొని రాత్రికి అక్కడే బసచేస్తారు. అర్థరాత్రి తరువాత నక్షత్ర అతిథిగృహం నుంచి 2:30గంటలకు మిషన్ కంట్రోల్ సెంటర్‌కు చేరుకొని అక్కడ నుంచి నేరుగా చంద్రయాన్-2 ప్రయోగాన్ని వీక్షిస్తారు. అనంతరం ఉదయం తిరిగి పయనమవ్వనున్నారు. రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా షార్‌లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

చిత్రాలు.. ప్రయోగ వేదికపై సిద్ధంగా ఉన్న రాకెట్, రాకెట్ శిఖర భాగాన చంద్రయాన్-2 మిషన్