జాతీయ వార్తలు

ముందు బీసీల లెక్క తేలాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: చట్టసభల్లో బీసీలకు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సభలో ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లు రాజ్యసభ తిరస్కరణకు గురైంది. చట్టసభల్లో బీసీల జనాభా నిష్పత్తి అనుగుణంగా రిజర్వేషన్లకు ఉద్దేశించిన రాజ్యాగ సవరణను ప్రతిపాదిస్తూ విజయసాయిరెడ్డి ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లును గత జూన్ 21 సభలోప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బిల్లుకు శుక్రవారం ఓటింగ్ నిర్వహించడానికి న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ నిరాకరించడంతో ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ విజయసాయిరెడ్డి సభ నుంచి వాకౌట్ చేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీతో సహా పలు పార్టీల సభ్యులు ఈ ప్రైవేటు బిల్లుకు మద్దతునిచ్చాయి. ఈ బిలుపై జరిగిన చర్చపై న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ 2021లో తిరిగి జనాభా లెక్కల సేకరణ పూర్తయ్యే వరకు బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ అనే అంశం చేపట్టడం సాధ్యం కాదని, అందువల్ల ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని విజయసాయిరెడ్డిని విజ్ఞప్తి చేశారు. దీనికి విజయసాయిరెడ్డి సమాధానం ఇస్తూ చట్టసభల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికపై రిజర్వేషన్లు కల్పించడానికి జనాభా లెక్కల సేకరణకు సంబంధం ఏమిటి? అంటూ నిలదీశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలకు చెందిన 65 శాతం మందికి మంత్రి వర్గంలో స్థానం కల్పించారని సభకు స్పష్టం చేశారు. ఇలాంటి ప్రాతినిధ్యం మరే రాష్ట్రాల్లోనూ ఇప్పటివరకు కల్పించలేదని ఆయన గుర్తు చేశారు. ఈ సభలో మెజారిటీ సభ్యులు సమర్ధిస్తున్నందున మంత్రి కోరినా తాను బిల్లును వెనక్కి తీసుకోనని స్పష్టం చేశారు. అలాగే ఈ బిల్లుపై ఓటింగ్ జరిపించాలని ఆయన డిప్యూటీ చైర్మన్‌ను విజయసాయిరెడ్డి పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఈ దశలో మంత్రి రవిశంకర్ ప్రసాద్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తి ఈ బిల్లుకు రాజ్యాంగ సవరణను ప్రతిపాదిస్తున్నందున, ఓటింగ్ జరపాలంటే సభలో మూడింట రెండొంతుల సభ్యుల మెజారిటీ అవసరముందని పేర్కొన్నారు. అసలు ఈ బిల్లులో పేర్కొన్న ఉద్దేశాలు, అందుకు ప్రతిపాదించిన రాజ్యాగ సవరణలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని మంత్రి వాదించారు. ఈ సమయంలో విజయసాయిరెడ్డికి పలు పార్టీలకు చెందిన ఎంపీలు మద్దతుగా నిలిచారు. దీంతో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసన వ్యక్తం చేసిన విజయసాయిరెడ్డి తాను సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించి బయటకు వెళ్లిపోయారు. దీంతో ఈ ప్రైవేటు మెంబరు బిల్లు రాజ్యసభలో తిరస్కరణకు గురైంది.