జాతీయ వార్తలు

న్యాయం చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 12: విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేసిన రైల్వే జోన్‌కు అన్ని వౌలిక సౌకర్యాలు కల్పిస్తామని ఆ శాఖ మంత్రి పీయూష్ గోయల్ హామీ ఇచ్చారు. పీయూష్ గోయల్ శుక్రవారం లోక్‌సభలో రైల్వే శాఖ పద్దులపై జరిగిన చర్చకు బదులిస్తూ హామీ ఇచ్చారు. తొలుత టీడీపీ పక్ష నేత గల్లా జయదేవ్ మాట్లాడుతూ జవసత్వాలు లేని రైల్వే జోన్‌ను ఏర్పాటు చేశారని ఆరోపించారు. ఆదాయం వచ్చే ప్రాంతమంతా భువనేశ్వర్ జోన్‌లో ఉండగా వ్యయమంతా విశాఖ రైల్వే జోన్ పరిధిలోకి వచ్చిందని చెప్పారు. పీయూష్ సమాధానం ఇస్తూ ‘విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేసిన రైల్వే జోన్ పూర్తిస్థాయి జోన్‌గా వ్యవహరిస్తుంది. ఈ విషయంలో ఏపీకి ఎలాంటి నష్టం కలుగకుండా చూస్తాం’ అని భరోసా ఇచ్చారు. ‘మీరొక పెద్ద పారిశ్రామికవేత్త. ఆర్థిక వ్యవహారాలు ఎలా ఉంటాయనేది మీకు బాగా తెలుసు. మీలాంటి వ్యక్తి కూడా ఆదాయం ఓ జోన్‌కు, వ్యయమంతా విశాఖ రైల్వే జోన్‌కు వెళ్తుందని చెప్పడం ఎంత వరకూ న్యాయం?’ అని గల్లాను అడిగారు. ‘మీరు చెప్పేది నిజమైతే ఖనిజ సంపద అత్యధికంగా ఉన్న జార్ఖండ్, చత్తీస్‌గఢ్‌లోనే పెట్టుబడులన్నీ పెట్టవలసి ఉంటుంది. కానీ ప్రభుత్వం అలా చేయటం లేదు’అని మంత్రి స్పష్టం చేశారు. తాము మొత్తం దేశాన్ని దృష్టిలో పెట్టుకుని కేటాయింపులు చేస్తామని, విశాఖ రైల్వే జోన్ విషయంలో కూడా అలాగే వ్యవహరిస్తున్నామని గోయల్ చెప్పారు. ‘విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేసిన రైల్వే జోన్‌కు పూర్తి న్యాయం చేస్తాం. ఈ విషయంలో ఏపీకి ఎలాంటి నష్టం జరగదు’అని మంత్రి భరోసా ఇచ్చారు. అలాగే తెలంగాణకూ నష్టం కలగనివ్వమని ఆయన అన్నారు. లోక్‌సభలో టీఆర్‌ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావులేవనెత్తిన అంశాలకు బదులిస్తూ ‘సభ్యుడు ప్రస్తావించిన రెండు రైల్వేలైన్ల నిర్మాణానికి సంబంధించిన పూర్తి వివరాలను లేఖ ద్వారా తెలియజేస్తాను’అని ప్రకటించారు.

చిత్రం... రైల్వే మంత్రి గోయల్