జాతీయ వార్తలు

రాజగోపాల్ రెడ్డిపై క్రమశిక్షణా చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 14: రాహుల్ గాంధీ, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీని విమర్శించి ఇప్పుడు మళ్లీ వారి నాయకత్వంలో పని చేస్తానని చెబుతున్న శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ పూటకోమాట మాట్లాడుతున్న రాజగోపాల్ రెడ్డి లాంటి నాయకుల మూలంగానే కాంగ్రెస్ నిర్వీర్యమవుతోందని చెప్పారు. బీజేపీలో చేరేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావటంతో రాజగోపాల్ రెడ్డి యు టర్న్ తీసుకుని కాంగ్రెస్ అధినాయకత్వాన్ని పొగుడుతున్నాడని హనమంతరావు చెప్పారు. కాంగ్రెస్ అధినాయకత్వాన్ని తానెప్పుడు విమర్శించలేదనీ.. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ కార్యదర్శి కుంతియా లాంటి వారి మూలంగానే పార్టీకి నష్టం జరిగిందని మాత్రమే చెప్పానంటూ రాజగోపాల్ రెడ్డి మాట మార్చటం సిగ్గు చేటన్నారు. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే జోక్యం చేసుకుని రాజగోపాల్ రెడ్డిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని వీహెచ్ డిమాండ్ చేశారు. కర్నాటకలో రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ప్రధాన కార్యదర్శిని విమర్శించిన శాసనసభ్యుడు గుల్షన్ బేగ్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లే ఆయనపై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.