జాతీయ వార్తలు

తప్పుకున్న సిద్దూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, జూలై 14: కాంగ్రెస్ నాయకుడు నవజోత్ సింగ్ సిద్ధూ పంజాబ్ రాష్ట్ర క్యాబినెట్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌తో సిద్ధూకు కొద్ది రోజులుగా పడటం లేదు. దీంతో జూన్‌లో చేసిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో సిద్ధూ నుంచి కీలకమయిన శాఖలను ముఖ్యమంత్రి తొలగించారు. ఈ నేపథ్యంలో సిద్ధూ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి తన శాఖలను మార్చిన నాలుగు రోజుల తరువాత సిద్ధూ మంత్రి పదవికి రాజీనామా చేశారు. 55 ఏళ్ల సిద్ధూ తన రాజీనామా లేఖ ప్రతిని ఆదివారం సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. జూన్ పదో తేదీతో ఉన్న తన రాజీనామా లేఖను సిద్ధూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఉద్దేశించి రాశారు. ‘నేను పంజాబ్ క్యాబినెట్ నుంచి మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాను’ అని సిద్ధూ ఆ లేఖలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తన శాఖను మార్చిన తరువాత సిద్ధూ ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీని కలిశారు. రాహుల్‌ను కలిసిన మరుసటి రోజు తేదీ అతని రాజీనామా లేఖపై ఉంది. సిద్ధూ తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి పంపించబోతున్నట్టు తరువాత మరో ట్విట్టర్ సందేశంలో పేర్కొన్నారు. సీఎం అమరీందర్ సింగ్ జూన్ ఆరో తేదీన చేసిన తన మంత్రివర్గ విస్తరణలో సిద్ధూ నుంచి స్థానిక పాలన, పర్యాటకం, సాంస్కృతిక వ్యవహారాల శాఖలను తొలగించారు. విద్యుత్తు, పునరుత్పాదక ఇంధన శాఖలను కొత్తగా కేటాయించారు. ఈ మంత్రివర్గ విస్తరణలో ఇతర మంత్రులకు చెందిన శాఖలను కూడా సీఎం మార్చారు. సీఎం జూన్ ఎనిమిదో తేదీన ఏర్పాటు చేసిన కన్సల్టేటివ్ గ్రూప్‌ల నుంచి కూడా సిద్ధూ తప్పుకున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగి నెల రోజులు గడిచిపోయినా సిద్ధూ తనకు కొత్తగా కేటాయించిన శాఖల బాధ్యతలు స్వీకరించలేదు.