అంతర్జాతీయం

అవినీతి రహితంగా భారతీయ రైల్వేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 15: భారతీయ రైల్వేలను అవినీతి రహితంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. తమ శాఖలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నట్టు ఆదివారం ఇక్కడ చెప్పారు. యూకేలో మూడు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన పీయూష్ గోయల్ బ్రిటన్‌లో ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. అన్ని ప్రభుత్వ శాఖలను అవినీతి రహితంగా తీర్చిదిద్దడానికి నరేంద్రమోదీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి స్పష్టం చేశారు. ‘అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అనేక మంది అధికారులపై ఇప్పటికే చర్యలు తీసుకున్నాం. నా మంత్రిత్వశాఖలో దీనిపై అధ్యయనం జరుగుతోంది. అవినీతికి పాల్పడే అధికారులపై చర్యలు తీసుకోవడం ద్వారా మిగతావారు తప్పుచేయకుండా సంకేతాలు ఇవ్వవచ్చు’అని రైల్వే మంత్రి పేర్కొన్నారు. లండన్‌లోని హైకమిషన్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్, ఇండస్ట్రీ(్ఫక్కీ) సంయుక్తంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ‘అవినీతి విముక్తి భారత్’పై అడిగిన ప్రశ్నకు మంత్రి గోయల్ బదులిచ్చారు. తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ మార్పు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్టు ఆయన చెప్పారు. ప్రభుత్వ శాఖల్లో పారదర్శకతను అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. వాణిజ్య, పరిశ్రమల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత పీయూష్ తొలిసారి లండన్ పర్యటనకు వచ్చారు. దేశ ప్రయోజనాల కోసం వాణిజ్య ఒప్పందాలుంటాయని ఆయన ఉద్ఘాటించారు. కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ ఇటీవల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశాని దశ,దిశా నిర్దేశం చేసే రోడ్‌మ్యాప్ అని గోయల్ అన్నారు. 2024-25 నాటికి 5 ట్రిలియన్ యూఎస్ డాలర్ల లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన జరిగిందని, దాన్ని చేరుకోడానికి మోదీ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన అన్నారు.