జాతీయ వార్తలు

తీర్పు నేడే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, 16: కర్నాటకలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి, అనిశ్చితికి బుధవారం తెరపడే అవకాశం ఉంది. సుప్రీం కోర్టులో కర్నాటక ప్రభుత్వ, రెబెల్ ఎమ్మెల్యేల వాదనలు పూర్తయ్యాయి. తాము సమర్పించిన రాజీనామాలను ఆమోదించాల్సిందిగా కర్నాటక స్పీకర్ కేఆర్ రమేష్ కుమార్‌ను ఆదేశించాల్సిందిగా కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేశారు. వీరి రాజీనామాలు సరైన ఫార్మాట్‌లో లేవని, కాబట్టి స్పీకర్‌కు ఎలాంటి ఆదేశాలు లేదా సూచనలు చేయకుండా స్టేటస్ కోను కొనసాగించాలని కర్నాటక సర్కారు కోరింది. ఇరు వర్గాల వాదనలను విన్న ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ అధ్యక్షతన, న్యాయమూర్తులు దీపక్ గుప్తా, అనిరుద్ధ బోస్ సభ్యులుగా గల సుప్రీం కోర్టు బెంచ్ ఈ అంశంపై బుధవారం తీర్పును వెల్లడించనుంది. ఆదేశాలు కర్నాటక సర్కారుకు అనుకూలంగా ఉంటాయా లేక రెబెల్ ఎమ్మెల్యేల పక్షాన ఉంటాయా అన్నది ఆసక్తి రేపుతున్నది.
రెబెల్ ఎమ్మెల్యేల తరఫున వాదనలు వినిపించిన ముకుల్ రస్తోగీ వారు సమర్పించిన రాజీనామాలను ఆమోదించాల్సిందిగా కర్నాటక స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అదే విధంగా, రాజీనామాలు సమర్పించిన ఎమ్మెల్యేలపై కర్నాటక సర్కారు తీసుకున్న అనర్హత వేటు నిర్ణయంపై స్టేటస్ కోను కొనసాగించాల్సిందిగా ఇది వరకే జారీ చేసిన ఆదేశాలను కొనసాగేలా చూడాలని కూడా రస్తోగీ కోరారు. కర్నాటక అసెంబ్లీ సమావేశాల నుంచి రెబెల్ ఎమ్మెల్యేలను మినహాయించాలని, లేకపోతే, ఆయా పార్టీలు విప్‌లు జారీ చేసే అవకాశాలు ఉన్నాయని వివరించారు. కర్నాటక ప్రభుత్వం ఇప్పుడు మెజారిటీ కోల్పోయిందని, కాబట్టి, విప్‌లను జారీ చేయడం ద్వారా ఎమ్మెల్యేపై ఒత్తిడి తీసుకురావాలనే ప్రయత్నం జరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని, రాజీనామాలను ఆమోదించాల్సిందిగా కర్నాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్‌ను ఆదేశించాలని కోరారు. కాగా, కర్నాటక ముఖ్యమంత్రి హెడీ కుమారస్వామి ఈ విషయంలో సుప్రీం కోర్టు జోక్యాన్ని ప్రశ్నించారు. రాజీనామాలను ఆమోదించాలని ఒకటి, గత ఆదేశాలపై స్టేటస్‌కోను కొనసాగించాలని మరొకటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే అంశం సుప్రీం కోర్టు పరిధిలో లేదని స్పష్టం చేశారు. స్పీకర్‌ను ఫలానా విధంగా నిర్ణయాలు తీసుకోవాలంటూ స్పీకర్‌పై ఒత్తిడి తీసుకురావడం సరైనది కాదని సర్కారు తరఫున వాదనలు వినిపించిన రాజీవ్ ధావన్ అన్నారు. ‘రాజీనామా పత్రాలు నిబంధనలకు అనుగుణంగా, సరైన రీతిలో లేవు. ఈ పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను కోర్టు ఆదేశించడానికి వీల్లేదు’ అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని కూలదోసేందుకు జరుగుతున్న కుట్రను గమనించాలని, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలంటే ఇలాంటి పిటిషన్లను విచారణకు స్వీకరించ కూడదని అన్నారు. స్పీకర్ తరఫున వాదనలు వినిపించిన ఏఎం సింఘ్వీ పలు అంశాలను ప్రస్తావించారు. సభలో బలాన్ని నిరూపించుకోవాలని కోరుతూ, ప్రభుత్వం ఏర్పాటుకు బీఎస్ ఎడ్యూరప్పను గత ఏడాది అర్థరాత్రి స్పీకర్ ఆహ్వానించినప్పుడు, కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని గుర్తుచేశారు. స్టేటస్ కోను కొనసాగించాల్సిందిగా ఇది వరకు జారీ చేసిన ఆదేశాలను సవరించాలని కోరారు. అప్పుడు మాత్రమే, రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలు, అనర్హత వేటు వంటి అంశాలపై స్పీకర్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని సింఘ్వీ అన్నారు. వాదనలు విన్న సుప్రీం కోర్టు తీర్పును బుధవారానికి వాయిదా వేసింది.
చిత్రం...ముఖ్యమంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేయాలని కుమారస్వామిని డిమాండ్ చేస్తూ
మంగళవారం కర్నాటక అసెంబ్లీలో సభా వేదిక మధ్యకు వచ్చి నిరసన ప్రదర్శన చేసిన బీజేపీ సభ్యులు