జాతీయ వార్తలు

ఆదాయం రెట్టింపు ఎప్పుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 16: రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని అవలంభిస్తోందని కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆరోపించారు. వ్యవసాయ, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖల పద్దులపై లోక్‌సభలో జరిగిన చర్చలో ఉత్తమ్ కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీల అమలులో ఎన్డీయే ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. గత ఏడాదితో పోలిస్తే ఈ మంత్రిత్వ శాఖలకు ఈసారి తక్కువ నిధులు కేటాయించారని పేర్కొన్నారు. దేశంలో ప్రతిరోజు 30 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. దేశ జనాభాలో 65 శాతం నుంచి 75 శాతం మంది ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని చెప్పారు. కాని ప్రస్తుత ప్రభుత్వం వ్యవసాయ రంగంపై నిర్లక్ష్యంగా వ్యవహారిస్తోందని ఆరోపించారు. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించడంలో కేంద్రం విఫలమైందని అన్నారు. ప్రతి ఏడాది పది వేలు, పదకొండు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం ఆందోళన కల్గిస్తోందన్నారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం పథకాలు అందుబాటులో రావడం లేదు.. వ్యవసాయానికి పెట్టుబడుల అందని పరిస్థితి ఉందని వివరించారు. మూడేళ్ల క్రితం రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని ప్రధాన మంత్రి హామీ ఇచ్చారని.. కాని ఇప్పటికీ అది సాధ్యం కాలేదని అన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తామని 2014 ఎన్నికల సమయంలో బీజేపీ హామీ ఇచ్చింది.. కానీ ఇప్పటికి ఈ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని అన్నారు. నూనే గింజల ఉత్పత్తిచేసే రైతులకు లబ్ధి చేకూర్చేందుకుగాను కనీస మద్దతు ధర కోసం కేంద్రం ఏర్పాటు చెసిన ‘ప్రధాన మంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్ (పీఎం ఆశ) పథకానికి ఈ ఏడాది కేవలం రూ.1500 కోట్లు కేటాయించారని.. ఈ మొత్తం 14కోట్ల మంది రైతులకు ఏవిధంగా సరిపోతుందని ప్రశ్నిచారు. పత్తికి క్వింటాకు ప్రస్తుతం ఇస్తున్న కనీస మద్దతు ధరకు అదనంగా రూ.6000 కల్పించాలని కేంద్రాన్ని కోరారు. ‘పీఎం కిసాన్’ పథకం కింద రైతుకు ఏడాదికి రూ.6 వేలు ఇస్తామన్నారు.. కాని పెట్టుబడులకు ఈ మొత్తం ఎక్కడ సరిపోతుందని ప్రశ్నించారు. నిజమాబాద్ జిల్లాలో పెద్దఎత్తున పసుపు సాగు జరుగుతోంది.. ఎన్నికల సమయంలో బీజేపీ నాయకులు ఆ ప్రాంతంలో పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.. తక్షణమే ఏర్పాటు చేయాలని ఉత్తమ్ కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు.