జాతీయ వార్తలు

దుగ్గిరాలలో పసుపు పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 16: దుగ్గిరాలలో పసుపు పరిశోధనా కేంద్రం, గుంటూరులో మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పక్షం నాయకుడు గల్లా జయదేవ్ డిమాండ్ చేశారు. మంగళవారం లోక్‌సభలో వ్యయసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ పద్దులపై జరిగిన చర్చలో పాల్గొంటూ ఈ డిమాండ్ చేశారు. పసుపులో కుర్కిమెన్ శాతం ఎంత ఎక్కువగా ఉంటే పసుపు నాణ్యత అంత పెరుగుతుంది. అందుకు దుగ్గిరాలలో పసుపు పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని జయదేవ్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. పసుపులో కుర్కిమెన్ ఐదు లేదా ఆరు శాతం పెరిగితే పసుపు రైతులకు మంచి ధర లభిస్తుందని ఆయన తెలిపారు. మన దేశంలో అత్యధికంగా మిర్చి గుంటూరు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో పండుతోంది. ప్రపంచంలోని అతిపెద్ద మిర్చి యార్డ్ గుంటూరులో ఉన్నది.. ఈ ప్రాంతంలో మిర్చి బోర్డును ఏర్పాటు చేయటం వలన ఎంతో ప్రయోజనం ఉంటుందని ఆయన తెలిపారు. కరవు పరిస్థితుల మూలంగా నాట్లు ఇంకా పడలేదని.. కేంద్ర ప్రభుత్వం దేశంలోని కరవు ప్రాంతాలను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. తక్కువ నాణ్యత ఉన్న పొగాకుకు కిలోకు వంద రూపాయలు చెల్లించాలని అన్నారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లభించటం లేదని వాపోయారు. ఎన్‌డీఏ పాలనలో కూడా రైతుల పరిస్థితి ఎంతమాత్రం మారలేదని అన్నారు. మన్రేగా కేటాయింపులు బాగా లేవని ఆయన విమర్శించారు.