జాతీయ వార్తలు

త్వరలోనే వెనుకబడిన జిల్లాల నిధులు విడుదల చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 16: ఆంధ్రప్రదేశ్‌లోని ఏడు వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఉద్దేశించిన నాలుగో విడత నిధులను త్వరలోనే విడుదల చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ హామీ ఇచ్చారు. వైసీపీ పక్షం నాయకుడు విజయ సాయిరెడ్డి మంగళవారం రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ ఈ విషయం చెప్పారు. ఒడిశాలోని కలహండి, బోలంగీర్, కోరాపుట్ జిల్లాలు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతానికి ప్రకటించిన ప్యాకేజీ లాంటిది ఆంధ్రప్రదేశ్‌లోని ఏడు వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాలని విభజన చట్టంలో ఎక్కడా పేర్కొనలేదని అనురాగ్‌సింగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. ఏడు వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఆర్థిక సహాయం చేయాలంటూ నీతి ఆయోగ్ చేసిన సిఫారసు మేరకే ప్రతి జిల్లాకు రూ.300కోట్ల చొప్పున మొత్తం రూ.2,100కోట్లను విడతలవారీగా విడుదల చేస్తున్నట్లు మంత్రి వివరించారు.